Ramalamma Bridge: కడపజిల్లాలో వరదలకు కొట్టుకుపోయిన వంతెనను పునర్మించాలంటూ విద్యార్థుల వినతి
తుపాన్ కారణంగా వచ్చిన వరదలకు కడప జిల్లాలో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. చిన్న చిన్న బ్రిడ్జీలు కొట్టుకుని పోయాయి. అయితే వరదల కారణంగా రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజు పేట పంచాయితీ నుంచి రామయ్య పాలెం వెళ్లే బ్రిడ్జీ కొట్టుకుపోయింది. అయితే ఇదే దారిలో రోజూ 50 మంది దాకా విద్యార్తులు స్కూల్ కు వెలుతుంటారు. బ్రిడ్జీ కొట్టుకుని పోవడంతో వంకలోనే దిగి విద్యార్థులు పాఠశాలకు వెళుతున్నారు. ప్రమాదకరంగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడిపోతున్నారు. రామయ్య పాలెం నుంచి అనంతరాజు పేటకు మద్య రామాలమ్మ కాలువ పై ఉండే ఈ బ్రిడ్జి ప్రధానం. వరదల కారణంగా ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వీలైనంత త్వరగా వంతెన నిర్మించాలని సీఎం జగన్ ను చిన్నారులు కోరుతున్నారు.





















