Special Allocations For Amaravati in Union Budget 2024 | అమరావతిపై ప్రత్యేక ప్రేమను చూపించిన కేంద్రం
కేంద్ర బడ్జెట్ లో ఈసారి ఏపీ రాజధాని అమరావతిపై వరాల జల్లే కురిసింది. ఎన్డీయే కూటమిలో భాగమై టీడీపీ, జనసేన, బీజేపీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతికి భారీగా నిధుల కేటాయింపు జరపటంలో సీఎం చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ లో అమరావతి లో రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు పార్లమెంటు బడ్జెట్ ప్రసంగంలో స్పష్టమైన ప్రకటన చేశారు. అక్కడితో ఆగిపోలేదు. ఏపీకి అవసరమైనప్పుడల్లా అండగా ఉంటామని కేంద్రం అభయమిచ్చింది. ప్రత్యేక సదుపాయాలు, స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తామని పార్లమెంటులోనే బహిరంగ ప్రకటన చేసింది. రీజన్ ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో భాగంగా విభజన హామీలను నెరవేర్చేందుకు అందుకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు అందించేందుకు అండగా ఉంటామని అభయమిచ్చింది కేంద్రం. అంటే వేర్వేరు కేంద్ర ప్రభుత్వం సంస్థల నుంచి ఏపీకి రుణాలు అందివ్వటం, పోర్టుల నిర్మాణం అంతెందుకు పోలవరం ప్రాజెక్టును నిర్మించటంలో ఏపీ కి కావాల్సినంత సహాయం అందిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీన్ని స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ అంటామని చెప్పేందుకు కూడా వెనకాడ లేదు నిర్మలా సీతారామన్.