Sanitation Work Vijayawada Flood Affected Areas | బురదను క్లీన్ చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది
Sanitation Work Vijayawada Flood Affected Areas | విజయవాడలో బుడమేరు పొంగి భారీగా వరదలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే కాస్త వరద ఉద్ధృతి తగ్గుతోంది. రోడ్లన్నీ బురదతో నిండిపోయాయి. ఈ రోడ్లను శుభ్రం చేసేందుకు శానిటేషన్ వర్కర్స్ రంగంలోకి దిగారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ శానిటేషన్ పనుల్లో సాయం అందిస్తోంది. ఇళ్లలో పేరుకుపోయిన బురదను క్లీన్ చేస్తున్నారు. వీలైనంత వేగంగా శానిటేషన్ పనులను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.విజయవాడ నగరంలో మళ్లీ వర్షం ప్రారంభమైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న వర్షంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ముంపు నుంచి బయటపడిన ప్రాంతాల్లో ఫైరింజన్లతో శుభ్రం చేస్తున్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తోన్న నీటిని తాగడానికి వాడొద్దని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ప్రజలందరికీ తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు.