సీఎం జగన్ ప్రమేయం లేకుండానే APలో PK ప్లాన్ చేస్తారా ?
ప్రశాంత్ కిశోర్ కొత్త యుద్ధం మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు గేమ్ ప్లాన్ మొదలైంది. యూత్ ఇన్ పాలిటిక్స్ , ఐడియా ఇప్పుడు రాజకీయాల్లో బజ్ వర్డ్ అవుతుంది. ప్రశాంత్ కిషోర్ ఒక్కటే టార్గెట్ తో వున్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశానికీ అన్యాయం జరుగుతోందని, భవిష్యత్ దెబ్బ తింటోందని, దీనివల్ల యువత ఎక్కువగా నష్టపోతోందని చెప్పటం. జాబ్స్ రావాలంటే, దేశం బాగుపడాలంటే, సమర్థ నాయకత్వం కావాలిప్పుడు.. అనే స్లోగన్ ఇస్తూ యువతను తనతో కలవాలని పిలుపునిస్తున్నారు PK . ఇది దేశవ్యాప్త ప్లాన్. అయినా , AP గురించి ప్రత్యేకంగా చెప్పటానికి ఒక కారణం వుంది. ఏపీ సీఎం జగన్, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఇలాంటి టైం లో PK గేమ్ ప్లాన్ ఆసక్తి రేపుతోంది. మరో 2 నెలల్లో ప్రశాంత్ కిశోర్, యూత్ గేమ్ ప్లాన్ పట్టాలెక్కుతుందంటున్నారు.





















