Police Files Case on Sajjala | సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టిన పోలీసులు
కౌంటింగ్ సమయంలో రూల్స్ ఫాలో అయ్యేవాళ్లు వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు.
కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో వైసీపీ రెండు రోజుల క్రితం ఓ మీటింగ్ పెట్టింది. ఇందులో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూల్స్ పాటించే వాళ్లను కౌటింగ్ ఏజెంట్లుగా కూర్చొబెట్టొద్దని గట్టిగా నిలదీసేవాళ్లను ఉంచాలని కేడర్‌కు సూచించారు. ఇదే ఇప్పుడు కేసుకు కారణమైంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరింత హాట్‌గా మారుతున్నాయి.పోస్టల్ బ్యాలెట్, కౌంటింగ్ నేపథ్యంలో జరుగుతున్న పోరు మరో మలుపు తిరిగింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా కేసు రిజిస్టర్ అయింది. టీడీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు. రూల్స్ పాటించే కౌటింగ్ ఏజెంట్లు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలు కేడర్‌ను రెచ్చగొట్టేలా ఉన్నాయని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.