Pinnelli Ramakrishna Reddy met SP | నరసరావు పేట ఎస్పీ ఆఫీసు వద్ద పిన్నెల్లి ప్రత్యక్షం | ABP Desam
ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. పిన్నెల్లిని జూన్ 6వ తేదీ వరకూ అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇవ్వటంతో నిన్న అర్థరాత్రి నరసరావుపేటకు చేరుకున్న రామకృష్ణారెడ్డి.. ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆయన వివరాలు అందచేశారు. విదేశాలకు వెళ్లిపోకుండా పాస్ పోర్టు లాంటివి ఎస్పీకి హ్యాండోవర్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదు కాగా, 3 కేసుల్లో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రతిరోజు SP ఆఫీసులో సంతకం చేయాలని పేర్కొంది. నరసరావుపేట దాటి పిన్నెల్లి వెళ్లొద్దని, ఆ ఊళ్లో ఎక్కడ ఉంటున్నారో పల్నాడు ఎస్పీకి తెలియజేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం విధించిన షరతుల మేరకు పిన్నెల్లి వచ్చి ఎస్పీని కలిసి వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు తను పల్నాడు జిల్లా వదిలి వెళ్లని ఎస్పీకి లిఖితపూర్వకంగా రాసిచ్చారు.