Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP Desam
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోపే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23వ తేదీన ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. రూ.4500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేసింది. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన పత్రాన్ని, మెడల్ ను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ పవన్ కల్యాణ్‌కి అందచేశారు. గ్రామాలకు స్వపరిపాలన అందించాలనే ఆకాంక్షతో మొదలైన ఈ ప్రయాణంలో ఈ కొత్త మైలు రాయిని అందుకోవడం ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ సభలు విజయవంతం చేయడంలో భాగస్వాములైన అధికార యంత్రాంగానికి, స్థానిక సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియచేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామసభల్లో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు తెలిపారు.
![Judicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/02/03af1690241ef802ee0862d460ff4bfd1738510480213310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![YS Jagan Comeback AP Politics | చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఇకపై చుక్కలేనా | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/31/46947a75cc00a9487742b86dc6395a301738337361333310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Chena poda Sweet Lavanya Kota | ఒడిషా బోర్డర్ లో దొరికే టేస్టీ స్వీట్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/493ddc93209ea9e137de2919dcfa75131738247665838310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Pawan kalyan vs Peddireddy Ramachandra reddy | సీమలో పెద్దిరెడ్డిని పవన్ ఢీ కొడతారా.? | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/7cb64334f614e32f1aed0c0cd926c6301738247042631310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![ISRO's Histroic 100th Launch Success | నేవిగేషన్ శాటిలైట్ ను సక్సెస్ ఫుల్ గా ప్రవేశపెట్టిన ఇస్రో | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/88e2c519717f89711feb629333eb27521738139124160310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)