Pak Army Killed Jawan Murali Naik | పాక్ వక్రబుద్ధికి బలైపోయిన తెలుగు తేజం మురళీ నాయక్ | ABP Desam
ఆపరేషన్ సిందూర్ తర్వాత తన వక్రబుద్ధి చూపించుకుంటున్న పాక్ LOC వెంబడి కాల్పులకు తెగబడుతోంది. అమాయక పౌరులను సైతం టార్గెట్ చేసుకుని కాల్పులు జరుపుతున్న పాక్ ఆర్మీని అడ్డుకునే యత్నం మన తెలుగు జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైన్యాన్ని తరిమికొడుతూ అమరుడైన మురళీది సత్యసాయి జిల్లా గోరంట్ల మండంలోని కల్లి తండా. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మురళీ నాయక్ సైన్యం లో చేరి దేశసేవ చేయాలనే కలతో జవాన్ గా ఉద్యోగం సాధించి జమ్ము కశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతున్న పాక్ దుశ్చర్యకు తెలుగు తేజం మురళీ నాయక్ చిన్న వయస్సులో అమరవీరుడయ్యాడు. మురళీ మృతి చెందిన సైన్యం అందించిన సమాచారంతో కల్లి తండాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మురళీ తల్లితండ్రులు తమ బిడ్డ మరణ వార్తతో గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతిపై సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేశం కోసం ప్రాణాలే త్యజించిన అమరవీరుడి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఫార్మాలిటీస్ పూర్తైన తర్వాత రేపు సాయంత్రానికి మురళీ నాయక్ పార్థివదేహం స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉంది.





















