PABR Dam Gates: 1000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
PABR డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు డ్యామ్ గేట్లు ఎత్తిన చరిత్ర లేదు. పెన్నా పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో నిండుకుండల్లా మారిన పెన్నా ప్రాజెక్టులు. పేరూర్ ప్రాజెక్ట్,pabr ప్రాజెక్ట్,మిడ్ పెన్నర్ ప్రోజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న అధికారులు ఛాగ్గలు రిజర్వాయర్ గేట్లను కూడా ఎత్తిన అధికారులు. కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలో ఉన్న పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడం అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.డ్యాం డిఇ రమణారెడ్డి, జేఈ రామకృష్ణ, కూడేరు తహశీల్దార్ శ్రీనివాసులు, ఉరవకొండ తహశీల్దార్ మునివేలు ,సీఐ శేఖర్ తదితరులు పర్యవేక్షించారు.





















