Anantapur Rains Update : పంటపొలాలను ముంచెత్తుతున్న నీరు
అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం బుచ్చయ్య గారి పల్లి వద్ద హంద్రీ-నీవా కాలువకు గండి పడటంతో వృధాగా పోతున్న నీరు పంటపొలాలను ముంచేస్తోంది. దీంతో వందలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదే క్రమంలో ముదిగుబ్బ బుక్కపట్నం ప్రధాన రహదారి పై పెద్ద ఎత్తున నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి హంద్రీనీవా కాలువ కు గండి ని పూడ్చాలని కోరుతున్నారు. అదే విధంగా ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అలాగే రోడ్డు పైకి వస్తున్న నీటిని దారి మళ్ళించక పోతే రోడ్డు మరింత కోతకు గురై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశముందని వాహనదారులు వాపోతున్నారు.





















