Kakinada Rural MLA Pantham Nanaji Interview | పదిలక్షల కోట్ల అప్పు...85లక్షల టన్నుల చెత్త వైసీపీ వదిలేసి పోయింది | ABP Desam
కూటమి ప్రభుత్వంలో కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో అవినీతికి పాల్పడ్డ వారిని ఎవరిని వదిలే ప్రసక్తి లేదని అయితే ముందు గాడి తప్పిన రాష్ట్ర పాలనను అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ఓటమి ప్రభుత్వ రథసారథులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారని కానీ అవినీతికి పాల్పడ్డ వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు.. తాను అగ్రెసివ్ గా ఉంటారని ప్రచారం వెనక్స్ పరిస్థితులను బట్టి తప్ప ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ ఉండబోనాని తెలిపారు. తనకు అభిమానులు, కార్యకర్తలు ఫాలోయింగ్ కు కారణం తన వెనుకున్న పవన్ కళ్యాణ్ వల్ల నేనని అన్నారు భేదాభిప్రాయాలు ఉండవచ్చు గాని అవి వివాదాలు గొడవలు మాత్రం కాదన్నారు.. కూటమి ప్రభుత్వంలో కాకినాడను అత్యుత్తమ ప్రమాణాలున్న నగరంగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా పనిచేస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ఏబీపీ దేశంతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడిన ఆయన..కాకినాడలో ఐపీఎల్ మ్యాచ్ లు జరిగేలా ఓ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని నిర్మిస్తామని చెప్పారు. కూటమి లో భాగంగా ప్రజలందరికీ చేరువయ్యేలా జనసేన పాలన ఉంటుందంటున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో ఏబీపీ దేశం ప్రతినిధి సుధీర్ ఫేస్ టూ ఫేస్.





















