సోమువీర్రాజును అరెస్ట్ చేయాలంటూ కడపలో విద్యార్థి సంఘాల ఆందోళన
ఓటర్లను తాగుబోతులుగా చిత్రీకరిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ను అరెస్టు చేయాలంటూ కడపలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. సోము వీర్రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విద్యార్థి సంఘాల నాయకులు.... ప్రజలపై మోపిన పన్నుల భారం తగ్గించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆందోళనలో ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్‌యూఐ, ఆర్‌ఎస్‌వైఎఫ్, ఏఐవైఎఫ్ తదితర సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఓటర్లను తాగుబోతులుగా చిత్రీకరిస్తూ ఓటు వేస్తే మద్యం పోస్తామంటూ..మద్యం కోసం కోటి మంది ఓట్లు వేయాలంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఈ దేశ పౌరుల్ని అవమానకరంగా మాట్లాడిన సోము వీర్రాజు పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని...వెంటనే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.





















