Jawan Murali Naik Body Reached | బెంగుళూరు ఎయిర్ పోర్టు నుంచి స్వగ్రామానికి మురళీ నాయక్ పార్థివ దేహం | ABP Desam
దేశసేవలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ మురళీనాయక్ పార్థివదేహం బెంగుళూరు ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ప్రత్యేక సైనిక విమానంలో బెంగుళూరుకు చేరుకున్న పార్థివ దేహానికి కర్ణాటక మంత్రులు,ఏపీ మంత్రి సవిత పూలలు మాలలతో నివాళులు అర్పించారు. బెంగుళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా మురళీ నాయక్ భౌతికకాయాన్ని అంబులెన్స్ లో తీసుకువస్తున్నారు. అయితే అడుగుడగునా ప్రజలు మురళీ నాయక్ ను కడసారి చూడాలని వాహనాన్ని ఆపుతూ పూలు చల్లుతూ ఆ వీరుడికి కడసారిగా వీడ్కోలు సమర్పించుకుంటున్నారు. ఈ రోజు రాత్రికి స్వగ్రామమైన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకోనున్న మురళీ నాయక్ పార్థివదేహం చేరుకోనుండగా..రేపు మధ్యాహ్నం తర్వాత మురళీ అంతిమయాత్ర, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ మురళీనాయక్ అంత్యక్రియకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మురళీ నాయక్ తల్లి తండ్రులతో ఫోన్ లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలా ఆధుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.




















