Dacoits rob train: అనంతపురం జిల్లాలో రైల్లోకి చొరబడి మరీ దోపిడీ | ABP Desam
Anantapur జిల్లా Gooty మండలం Turakapalli Railway Station సమీపంలో అర్ధరాత్రి దోపిడీ జరిగింది. పథకం ప్రకారం.... స్టేషన్ సమీపంలో Signal Wires ను దుండగులు ముందుగానే కత్తిరించారు. కాసేపటికే Tirupati నుంచి Secunderabad వెళ్తున్న Seven Hill Express సిగ్నల్ లేకపోవటంతో స్టేషన్ ఔటర్ లో ఆగింది. రైలు ఆగగానే... బోగీల్లోకి చొరబడ్డ దుండగులు ప్రయాణికుల నుంచి నగదు, బంగారం లాక్కున్నారు. మారణాయుధాలతో వారిని బెదిరించారు. ఎంత మొత్తం దోపిడీ అయిందో ఇంకా తెలియలేదు. అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. Railway, Civil Police ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాల కోసం గాలించారు. రైలుకు సిగ్నల్ ఇచ్చి పంపించారు. బాధితులు కర్నూలు జిల్లా డోన్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.





















