వరద ప్రభావిత ప్రాంతాల్లో జేసీబీ మీద తిరిగిన సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి బాధితులను పరామర్శించారు. కొన్ని ప్రాంతాల్లో నీరు ఎక్కువగా నిలిచిపోవటంతో కాన్వాయ్ కదల్లేని పరిస్థితుల్లో ముందుకు వెళ్లటం కష్టమని అధికారులు ముఖ్యమంత్రికి సూచించారు. ప్రజలను కలిసి వారికి ధైర్యం చెప్పాలన్న చంద్రబాబు తన పర్యటన కోసం ఓ జేసీబీని రప్పించాలని సూచించారు. జేసీబీ భారీ టైర్ల కారణంగా వరద ప్రవాహాన్ని తోసుకుంటూ వెళ్లటంతో చంద్రబాబు యనమలకుదురు, పడమట ప్రాంతాల్లో పర్యటించిన బాధితులకు భరోసా కల్పించారు. రామలింగేశ్వర్ నగర్, జక్కంపూడి, భవానీ పురంలో పర్యటించి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ముంపు ప్రాంతాల్లో బాధితులు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు రోజు రాత్రి అంతా నిద్ర పోకుండా పరిస్థితిని సమీక్షించారు. పలు వరద ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. ముఖ్యంగా పూర్తిగా మునిగిపోయిన సింగ్ నగర్‌లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు పర్యటించారు.