CM Chandrababu Interaction with Common Man | చంద్రబాబు కాన్వాయ్ లో కామన్ మ్యాన్
తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పేదల సేవలో కార్యక్రమంలో పాల్గోనేందుకు వెళ్లిన చంద్రబాబు ఓ కిరాణా దుకాణం వద్ద ఆగి వ్యాపారం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. దుకాణ యజమానికి సూచనలు కూడా ఇచ్చారు. అక్కడే ఉన్న చర్మకారుడు పోశిబాబును పలకరించారు. కొవ్వూరు నియోజకవర్గంలోని ధర్మవరం నుంచి మలకపల్లి వరకూ తన కారులోనే పోశిబాబును ఎక్కించుకుని సీఎం ప్రయాణించారు. పోశిబాబు ఇంటికి వెళ్లి డప్పు కొట్టేవాళ్లకు ఇచ్చే పెన్షన్ అందుతోందా అంటూ పోశిబాబును సీఎం ఆరా తీశారు. పోశిబాబు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసిన ఆయనకు డబ్బులు ఇచ్చారు చంద్రబాబు. ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావటంతో పోశిబాబు కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. కారులో వెళ్తూ పోశిబాబుతో ముఖ్యమంత్రి వివిధ అంశాలపై మాట్లాడారు. పోశిబాబు నుంచి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. చర్మకారుడు పోశిబాబు కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్లు ఏం చేస్తున్నారనే అంశంపై ఆరా తీశారు.





















