BJP Targeting Kshatriya Community | క్షత్రియ వర్గానికి కేంద్రమంత్రి పదవి..బీజేపీ వ్యూహామేంటంటే.?
క్షత్రియ వర్గానికి కేంద్రమంత్రి పదవిని ఇచ్చింది ప్రధాని మోదీ ప్రభుత్వం. బీజేపీ నుంచి నిలబడి నరసాపురం ఎంపీగా నిలబడిన శ్రీనివాస వర్మకు కేంద్ర సహాయమంత్రి పదవిని కేటాయించింది. అసలు బీజేపీ వ్యూహం వెనుక కారణమేంటీ..ఈ వీడియోలో చూడండి.
అధికారంలోకి వచ్చినా తాము సామాన్యులుగానే ఉంటామని.. రాష్ట్రంలో ఏ ఒక్కరి హక్కులకు భంగం వాటిల్లదని ఎన్డీయే కూటమి శానససభాపక్ష నేత చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు. పదవి హోదా కోసం కాదని.. ప్రజలకు సేవ చేసేందుకే అని అన్నారు. పదవి వచ్చిందని విర్రవీగొద్దని.. వినయంగా ఉండాలని.. విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే, తప్పు చేసిన వారిని వదిలిపెడితే అది పూర్తిగా అలవాటుగా మారుతుందని.. అలాంటి వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు.