BJP Somu Veerraju : 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావాలి... బీజేపీ నేతలకు అమిత్‌షా క్లారిటీ
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉండటంతో 2024లో అధికారం దిశగా అడుగులేయాలని అమిత్ షా మాకు దిశా నిర్దేశం చేశారని ఏపి రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు..తిరుపతిలోని తాజ్ హోటల్ లో అమిత్ షాతో సుదీర్ఘ చర్చ అనంతరం సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో ముఖ్యమైన నేతలను బీజేపీలో చేర్చుకుని 2024లో ఏపీలో అధికారం దిశగా కార్యచరణ రూపొందించుకుంటాంమని,రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు..ఏపీలో గ్రామీణాభివృద్ధికి సహకారం అందిస్తామని అమిత్ షా చెప్పారని ఆయన వెల్లడించారు.. అనంతరం బిజేపి జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరీ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందన్నారు.





















