AP Ministers List | చంద్రబాబుతో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్నది వీళ్లే | ABP Desam
చంద్రబాబు మంత్రివర్గంలో మొత్తం 24 మందికి చోటు కల్పించారు. 25 మంది మంత్రుల్లో మిత్ర పక్షాల నేతలకు కూడా సమన్యాయం పాటిస్తూ మంత్రి పదవులను కేటాయించారు. మొత్తం మంత్రుల్లో టీడీపీకి 21, జనసేనకు 3, బీజేపీకి ఒక్క మంత్రి పదవి కేటాయించారు.
డిప్యూటీ సీఎం జనసేన పవన్ కల్యాణ్ అని ప్రచారం జరగడం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో పాటు నారా లోకేష్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. పవన్ కు ఏ శాఖ కేటాయించారు అన్నదానిపై స్పష్టత రాలేదు. జనసేన కనీసం 5 మంత్రి పదవులు ఆశించగా, మూడుకు పరిమితం చేశారు. బీజేపీకి రెండు మంత్రి పదవులు అని అంతా భావించగా, ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. అత్యధికంగా టీడీపీ నుంచి ఇరవైకి పైగా మంది మంత్రులు ఉండనున్నారు.
ఏపీలో కొత్త మంత్రుల జాబితా..
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, పి. నారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, ఎన్.ఎమ్.డి ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, ఎస్.సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులుగా నిలిచారు.