(Source: ECI/ABP News/ABP Majha)
Amaravati Women Farmers About Pawan kalyan | చంద్రబాబు, పవన్ పై అమరావతి రైతుల రియాక్షన్ చూడండి
కూటమి విజయంతో అమరావతికి పునర్‌వైభవం వచ్చిందని రాజధానికి భూములిచ్చిన మహిళా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయంతో అమరావతిలో అడుగుపెట్టనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు పూల వర్షంతో స్వాగతం పలకడానికి సిద్దంగా ఉన్నారు.
2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించి.. ఏకంగా వేలాది ఎకరాల భూములను సేకరించారు. అప్పట్లో ఎన్ని సమస్యలు వచ్చినా దాదాపు 35 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించగలిగారు. చంద్రబాబు తన పాలనలో అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టినప్పటికీ, వాటిని తాత్కాలిక భవనాలుగా పిలవడంతో ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తించలేదు. పైగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడంతో అమరావతి ప్రాంత రైతులు కదం తొక్కాల్సి వచ్చింది.అలా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు సుమారు నాలుగేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. చివరికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో అమరావతి రైతులో సంతోషంలో ఉన్నారు. చంద్రబాబు బాధ్యతలు తీసుకొనే జూన్ 13న సాయంత్రం ఆయనకు పూలతో స్వాగతం పలికేందుకు అమరావతి ప్రాంత వాసులు ఇలా భారీ ఎత్తున పూలను సిద్ధం చేశారు.