Agriculture Officer Sridher | ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో ఫేస్ టు ఫేస్
ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు ఖరీఫ్ సాగు కోసం సిద్ధమవుతున్నారు.. గత నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలతో పలువురు రైతులు విత్తనాలు విత్తుకున్నారు. ఆ తరువాత మళ్లీ వర్షాల జాడ కనిపించడం లేదు. జిల్లాలో చాలా మంది రైతులు మృగశిరకార్తె తరువాత విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే జిల్లాలోని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు నాటేముందు ఎలాంటి విత్తనాలు వేసుకోవాలని సలహా సూచనలు అందిస్తున్నారు......? జిల్లాలో ఏయే రకాల విత్తనాల కొరత ఉంది.. ప్రస్తుతం జిల్లాలో ఎన్ని రకాల విత్తనాలు, యూరియాలు అందుబాటులో ఉన్నాయి..? జిల్లాలో అధికమవుతాదులో రైతులు ఏయే రకాల పంటల విత్తనాలను వేస్తున్నారు..? మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రైతులు నకిలీ విత్తనాలు తీసుకోని మోసపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..? ఈ అంశాలపై ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ మా రిపోర్టర్ స్వామితో abp దేశం ఫేస్ టు ఫేస్.





















