Afg vs Ind Super 8 Match Highlights | సూపర్ 8 మ్యాచ్ లో ఆఫ్గాన్ పై భారత్ విక్టరీ | T20 Worldcup 2024
లీగ్ దశలో వరుస విజయాలతో సూపర్ 8 దశకు దూసుకొచ్చిన భారత్ సూపర్ 8 మ్యాచుల్లో మొదటి విజయం ఆఫ్గనిస్తాన్ పై అందుకుంది. పేరుకు చిన్న టీమే అయినా ఇదే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ లాంటి పెద్ద టీమ్ కు షాక్ ఇచ్చి కాబూలీలను జాగ్రత్తగా ఆడాలని ముందు నుంచి సూచనలు వినిపిస్తున్నా మన బ్యాటర్లు కాస్త లైట్ తీసుకున్నట్లు అనిపించింది స్టార్టింగ్ మ్యాచ్ చూసినప్పుడు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్..బ్యాటింగ్ లో ప్రత్యేకించి కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ మరోసారి నిరాశపరిచారు.
మూడో ఓవర్లోనే రోహిత్ ఫజహల్ ఫరూఖీకి దొరికిపోగా...ఇబ్బంది పడుతూ కనిపించిన కొహ్లీ 24 బంతుల్లో 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ కు చిక్కాడు. భారత కీలక బ్యాటర్లైన కొహ్లీ, పంత్, శివమ్ దూబే వికెట్లు దక్కించుకోవటం ద్వారా రషీద్ ఖాన్ టీమిండియా మీద ఒత్తిడి పెంచే ప్రయత్నమైతే చేశాడు. 90పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ను సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. సూర్యా భాయ్ 28బంతుల్లో 5ఫోర్లు 3సిక్సర్లతో 53పరుగులు చేస్తే...పాండ్యా బాబు 32పరుగులు చేసి స్కోరు బోర్డును నిలబెట్టారు. వీరిద్దరి కష్టంతో భారత్ ఆఫ్గాన్ కు 182పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఆఫ్గాన్ బ్యాటర్లు ఏమన్నా మెరుపులు మెరిపిస్తారో ఏమో అని మొదటి ఓవర్ చూసినప్పుడు అనిపించినా రెండో ఓవర్లోనే బుమ్రా బౌలింగ్ దిగటంతో కాబూలీ గేమ్ కట్ అయ్యింది. పిసినారిలా బౌలింగ్ చేసిన బుమ్రా 4ఓవర్లలో 7పరుగులే ఇచ్చి ఓ మెయిడిన్ తో పాటు 3వికెట్లు తీసుకున్నాడు. మరో ఎండ్ లో అర్ష్ దీప్ కూడా పట్టు బిగించటంతో ఆఫ్గాన్ 134పరుగులకు ఆలౌట్ అయ్యింది. 26పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్జాయే టాప్ స్కోరర్. మొత్తం మీద సూపర్ 8లో మొదటి మ్యాచ్ గెలిచేసుకున్న భారత్ తన రెండో మ్యాచ్ ను రేపు బంగ్లా దేశ్ తో ఆడనుంది.