Munugode Bypoll | లాస్ట్ టైంలా కాదు ఈసారి ఇలా వెళ్దామంటున్న కేసిఆర్ | DNN | ABP Desam
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రయోగాలకు తెరలేపుతోంది. గతంలో జరిగిన ఉపఎన్నికలకు భిన్నంగా ఇక్కడ వ్యవహరించబోతున్నది. గతంలో ఏ ఉప ఎన్నికలు జరిగా హామీల వర్షం కురిసేది. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఈ సారి అభివ్రుధ్ది కి హామీలు ఇస్తే దాన్ని రాజగోపాల్ రెడ్డి క్లైయిమ్ చేసుకునే అవకాశం ఉంది. నా వల్లే, నా రాజీనామా వల్లే అని ప్రచారాం చేసుకునే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు భిన్నంగా ఇక్కడ వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. కేసిఆర్ కూడా మునుగోడులో ప్రచారం చేసే అవకాశంలేదని తెలుస్తోంది. మరోవైపు స్థానిక నేతలకు, పార్టీ క్యాడర్ కే బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలుస్తోంది.





















