అన్వేషించండి

మనదేశంలోనే ఐఫోన్ 14 తయారీ - త్వరలోనే ప్రారంభం!

యాపిల్ ఐఫోన్ 14 తయారీ త్వరలో మనదేశంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.

యాపిల్ ఇటీవలే లాంచ్ చేసిన ఐఫోన్ 14 మనదేశంలో త్వరలో తయారు కానుంది. ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ అయిన మనదేశంలో కూడా స్మార్ట్ ఫోన్లు తయారీ కానున్నాయి. 2017లో మనదేశంలో యాపిల్ ఫోన్లు తయారవడం మొదలయ్యాయి.

మనదేశంలో తయారైన మొదటి యాపిల్ మొబైల్ ఐఫోన్ ఎస్ఈ. ఆ తర్వాత ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 12, ఐఫోన్ 13 మనదేశంలో తయారు కాగా... ఇప్పుడు ఐఫోన్ 14 కూడా తయారు కానుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఐఫోన్  14 సిరీస్ మనదేశంలో తయారు కానున్నాయి. ఈ విషయాన్ని యాపిల్ పీటీఐకి తెలిపింది. చెన్నైలోని శ్రీపెరంబదూరు ఫెసిలిటీలో ఇవి తయారు కానున్నాయి. ఐఫోన్ 14 సిరీస్ సెప్టెంబర్ 7వ తేదీన మార్కెట్లో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్నాయి.

ఐఫోన్ 14 సిరీస్ ధర
ఐఫోన్ 14 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900 నుంచి, ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,29,990 నుంచి, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధ‌ర‌ రూ.1,39,990 నుంచి ప్రారంభం కానుంది. వీటిలో ఐఫోన్ 14 ప్లస్ తప్ప మిగతా అన్ని మోడల్స్ సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది.

ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.

ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్లు కూడా దాదాపుగా ఐఫోన్ 14 తరహాలోనే ఉన్నాయి. ఇందులో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. కెమెరాలు మాత్రం ఐఫోన్ 14 తరహాలోనే ఉన్నాయి.

ఐఫోన్ 14 ప్రో స్పెసిఫికేషన్లు
ఇక ప్రో మోడల్స్ విషయానికి వస్తే... వీటిలో సర్జికల్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను అందించారు. ఐఫోన్ 14 ప్రోలో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. ఫోన్ ముందువైపు పిల్ ఆకారంలో ఉన్న హోల్ పంచ్ కటౌట్‌ను యాపిల్ అందించింది. దీనికి డైనమిక్ ఐల్యాండ్ అని పేరు పెట్టారు. యాపిల్ ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్ 48 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన కెమెరా అందించారు.

ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్లు
దీని ఫీచర్లు కూడా దాదాపుగా ఐఫోన్ 14 ప్రో తరహాలోనే ఉన్నాయి. ఇందులో పెద్ద డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే సైజు 6.7 అంగుళాలుగా ఉంది. ప్రో మోషన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Medigadda Barrage Restoration:కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం- మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కార్ ఫోకస్! టెండర్లు వేయడానికి 15 వరకు గడువు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం- మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కార్ ఫోకస్! టెండర్లు వేయడానికి 15 వరకు గడువు
YS Jagan: చంద్రబాబూ చరిత్ర హీనుడిగా మిలిగిపోతావు - వైఎస్ జగన్ సంచలన ట్వీట్
చంద్రబాబూ చరిత్ర హీనుడిగా మిలిగిపోతావు - వైఎస్ జగన్ సంచలన ట్వీట్
Cough syrup death case: అలర్ట్ -ఈ దగ్గుమందు పొరపాటున కూడా మీ పిల్లలకు ఇవ్వొద్దు - బ్యాన్ చేశారు!
అలర్ట్ -ఈ దగ్గుమందు పొరపాటున కూడా మీ పిల్లలకు ఇవ్వొద్దు - బ్యాన్ చేశారు!
Dhanush Idly Kottu Movie Review In Telugu | ధనుష్, నిత్య మీనన్ ఇడ్లీ కొట్టు ఎలా ఉందంటే.? | ABP Desam
Dhanush Idly Kottu Movie Review In Telugu | ధనుష్, నిత్య మీనన్ ఇడ్లీ కొట్టు ఎలా ఉందంటే.? | ABP Desam
Advertisement

వీడియోలు

Dhanush Idly Kottu Movie Review In Telugu | ధనుష్, నిత్య మీనన్ ఇడ్లీ కొట్టు ఎలా ఉందంటే.? | ABP Desam
BCCI vs PCB | Asia Cup 2025 | ఆసియా కప్ ట్రోఫీపై ముదురుతున్న వివాదం
India vs Sri Lanka Women World Cup | శ్రీలంకపై భారత్ విజయం
Asia Cup 2025 Ind vs Pak Controversy | ఆసియాక‌ప్ కాంట్రవర్సీపై మాజీ క్రికెట‌ర్ ఆవేద‌న‌
Women World Cup 2025 | Smriti Mandhana | ట్రోల్స్ ఎదుర్కొంటున్న స్మృతి మంధాన
Advertisement
Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medigadda Barrage Restoration:కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం- మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కార్ ఫోకస్! టెండర్లు వేయడానికి 15 వరకు గడువు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం- మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కార్ ఫోకస్! టెండర్లు వేయడానికి 15 వరకు గడువు
YS Jagan: చంద్రబాబూ చరిత్ర హీనుడిగా మిలిగిపోతావు - వైఎస్ జగన్ సంచలన ట్వీట్
చంద్రబాబూ చరిత్ర హీనుడిగా మిలిగిపోతావు - వైఎస్ జగన్ సంచలన ట్వీట్
Cough syrup death case: అలర్ట్ -ఈ దగ్గుమందు పొరపాటున కూడా మీ పిల్లలకు ఇవ్వొద్దు - బ్యాన్ చేశారు!
అలర్ట్ -ఈ దగ్గుమందు పొరపాటున కూడా మీ పిల్లలకు ఇవ్వొద్దు - బ్యాన్ చేశారు!
Dhanush Idly Kottu Movie Review In Telugu | ధనుష్, నిత్య మీనన్ ఇడ్లీ కొట్టు ఎలా ఉందంటే.? | ABP Desam
Dhanush Idly Kottu Movie Review In Telugu | ధనుష్, నిత్య మీనన్ ఇడ్లీ కొట్టు ఎలా ఉందంటే.? | ABP Desam
Chandrababu in Datti: సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్  - 63 లక్షల మందికి పెన్షన్లు - విజయనగరం జిల్లా పేదల సేవలో చంద్రబాబు
సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్ - 63 లక్షల మందికి పెన్షన్లు - విజయనగరం జిల్లా పేదల సేవలో చంద్రబాబు
Allu Sirish: అల్లు ఫ్యామిలీ నుంచి గుడ్ న్యూస్ - ఆ రోజున అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్... ఆయనకు కాబోయే భార్య ఎవరంటే?
అల్లు ఫ్యామిలీ నుంచి గుడ్ న్యూస్ - ఆ రోజున అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్... ఆయనకు కాబోయే భార్య ఎవరంటే?
Flight Ban: విమానాలు ఎక్కేవారికి కొత్త రూల్స్ - ఈ వస్తువు తీసుకెళ్తే బయటే ఆపేస్తారు !
విమానాలు ఎక్కేవారికి కొత్త రూల్స్ - ఈ వస్తువు తీసుకెళ్తే బయటే ఆపేస్తారు !
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ - 3 శాతం డీఏ హైక్ - జూలై నుంచి వర్తింపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ - 3 శాతం డీఏ హైక్ - జూలై నుంచి వర్తింపు
Embed widget