అన్వేషించండి

Mahabubabad News: భర్తకు దగ్గరుండి మరీ మరో పెళ్లి చేసిన భార్య - అసలు కారణం ఏంటో తెలుశా?

Telangana News: ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి మరీ మరో యువతితో వివాహం జరిపించిన ఘటన మహబూబాబాద్‌లో జరిగింది. మానసిక వికలాంగురాలైన యువతి తన భర్తను ఇష్టపడిందని తెలిసి మనస్ఫూర్తిగా వారికి పెళ్లి చేయించింది.

Wife Remarring Her Husband In Mahabubabad: తన భర్త వేరే మహిళను కన్నెత్తి చూసినా ఏ స్త్రీ తట్టుకోలేదు. అలాంటిది ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేయించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad District) జరిగింది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌కు చెందిన సురేష్, సరిత దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే, సురేష్‌కు ఓ మేనమామ ఉన్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి ఇప్పటికే వివాహం జరగ్గా.. చిన్న కూతురు సంధ్య ఓ మానసిక వికలాంగురాలు. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. ఈ క్రమంలో తమ తర్వాత ఆమె పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సంధ్య గురించి పూర్తిగా తెలిసి అర్థం చేసుకున్న వారే ఆమెను బాగా చూసుకుంటారని భావించారు. 

పెళ్లి ప్రతిపాదన

ఈ క్రమంలో సంధ్య తల్లిదండ్రులు.. సురేష్ దంపతుల ముందు రెండో పెళ్లి ప్రతిపాదన పెట్టారు. సరితకు కూడా సంధ్య గురించి పూర్తిగా తెలుసు. ఆమెను చెల్లెలిగానే చూస్తూ వస్తోంది. మానసిక వికలాంగురాలైన సంధ్య సురేష్‌ను ఇష్టపడిందని తెలుసుకున్న సరిత వీరి పెళ్లికి అంగీకరించింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయంలో బంధు మిత్రుల సమక్షంలో సురేష్, సంధ్యల వివాహం దగ్గరుండి మరీ జరిపించినట్లు బంధు మిత్రులు తెలిపారు. సంధ్య మానసిక వికలాంగురాలని.. ఆమె తన భర్త మేనమామ కూతురని సరిత తెలిపారు. ఆమెను తన చెల్లెలిలా చూసుకునేందుకే తన భర్తకు ఇచ్చి వివాహం జరిపించానని చెప్పారు. ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also Read: FM Radio Stations: తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఎఫ్ఎం రేడియో కేంద్రాలు - ఏయే ప్రాంతాల్లో అంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Jagan About Tirumala: తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
Amazon Great Indian Festival Sale: అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
Embed widget