బుధవారానికి ఒంటెకు ఏం సంబంధం? 1950ల నుంచి ఫాలో అవుతున్న ట్రెడిషన్ ఏంటీ?
వెస్టర్న్ కంట్రీస్ లో చాలా మటుకు వర్క్ ప్లేసెస్ లో వెడ్నెస్ డేను హంప్ డే అంటారు. దాని వెనుక కథేంటో తెలుసా..?
మీకో విషయం తెలుసా.... వెడ్నెస్ డేను హంప్ డే అంటారు. దానికి ఓ లాజికల్ ఎక్స్ ప్లనేషన్ కూడా ఉంది. ఒకే... ఫస్ట్ ఓ విషయం ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా చాలా మటుకు జాబ్స్ అయినా లేదా స్టడీస్ లాంటివి అయినా సరే... 5 డే వీక్ ఉంటుంది. అది కూడా ఎలాంటి 5 డే వీక్...? మండే టు ఫ్రైడే ఉండే 5 డే వీక్. సాటర్డే, సండే వీక్లీ ఆఫ్స్ ఉంటాయి... మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ లో.
సో ఇప్పుడు మ్యాటర్ కు వద్దాం. వెడ్నెస్ డేనే హంప్ డే ఎందుకు అంటారు..? అసలు హంప్ అంటే ఏంటి..? ఒంటెకు ఉండే మూపురాన్ని హంప్ అంటారు. ట్రెడిషినల్ గా అందరూ చెప్పుకునే 5 వర్కింగ్ డేస్ లో వెడ్నెస్ డే కరెక్ట్ గా మూడో రోజు. అంటే మధ్యలో ఉంటుంది. జనరల్లీ చాలా మందికి ఉండే ఫీలింగ్ ఏంటి... సోమవారాలు చాలా బద్ధకంగా గడుస్తాయి అని. దాన్నే ఇంగ్లీష్ లో మండే బ్లూస్ అంటారు. ఇక ట్యూస్ డే కూడా ఇంచుమించు అలానే ఉంటుంది.
సో.... వర్కింగ్ వీక్ లో మొదటి రెండు రోజులు చాలా భారంగా, బద్దకంగా గడుస్తాయన్న ఫీలింగ్ వస్తుంది. సో ఈ ఫీలింగ్ నే ఒంటె హంప్ తో పోల్చారు. ఆ రెండు రోజులు చాలా నీరసంగా, నిదానంగా... హంప్ పైకి ఎక్కుతున్న రోజులుగా వాటిని వర్ణించారు. ఇక వెడ్నెస్ డే.... అంటే వీక్ మధ్యలో వచ్చే రోజు. ఆ రోజును... మనం హంప్ టాప్ మీదకు చేరుకున్నట్టుగా భావిస్తారు. సో అక్కడి నుంచి మిగతా రెండు రోజులు... గురు, శుక్రవారాలు చాలా త్వరగా గడిచిపోయాయన్న ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత వీకెండ్ వైబ్స్ ఉండనే ఉంటాయిగా. సో ఆ రకంగా... అది కష్టం మీద 2 రోజులు గడిపిన తర్వాత వచ్చే రోజు.... వెడ్నెస్ డే. కరెక్ట్ గా వీక్ మధ్యలో ఉంటుంది కాబట్టి.... దీన్ని హంప్ డే అంటారు. దాని తర్వాతి రోజులు చకచకా జరిగిపోతాయనే భావన ఉంటుంది. ఈ విధంగా వెడ్నెస్ డేను హంప్ డే అని పిలవడం.... 1950 ల టైంలో అమెరికాలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత వెస్టర్న్ వర్క్ కల్చర్ లో ఈ హంప్ డే పదాన్ని ఎక్కువగా వినియోగిస్తూ వస్తున్నారన్నమాట. ఇది వెడ్నెస్ డేకు హంప్ కు ఉన్న కనెక్షన్.