By: ABP Desam | Updated at : 17 Jun 2023 08:39 PM (IST)
Edited By: Pavan
ప్రమాద సంకేతంగా రెడ్ కలర్‌నే ఎందుకు వాడతారు? దాని వెనక ఉన్న సైన్స్ ఏంటి? ( Image Source : Pixabay )
Red Color As Danger: రోడ్లపైన, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద, ఎత్తైన టవర్లపై, వాహనాల వెనక ఎరుపు రంగును, లైట్లను చాలా మంది గమనించే ఉంటారు. అయితే ఎరుపు రంగును ఎందుకు వాడతారు.. పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులను ఎందుకు వాడరని ఎప్పుడైనా మీకు ప్రశ్న తలెత్తిందా? ఎరుపు రంగునే ప్రమాద సంకేతంగా వాడటం వెనక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో తెలుసుకుందామా?
ఎరుపు రంగును ప్రమాద సంకేతంగా ఎందుకు ఉపయోగిస్తారు?
ఎరుపు రంగును దూరం నుంచి అయినా సులభంగా గుర్తించవచ్చు. ఎరుపు రంగు కాంతి ఎక్కువ దూరం ప్రయాణించగలదు. మిగతా రంగులతో పోలిస్తే రెడ్ కలర్ తరంగధైర్గ్యం గరిష్ఠంగా ఉంటుంది. అలాగే వాతావరణంలో మిగతా రంగుల్లాగా ఎరుపు రంగు చెల్లాచెదురైపోదు. అలాగే రెడ్ కలర్ మానవులకు అత్యంత సున్నితంగా ఉండే రంగు. మన కళ్లలోని రెటీనాలో ఇతర రంగుల కంటే ఎరుపు కాంతికి ఎక్కువ గ్రాహకాలు ఉంటాయి. దీని వల్ల తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా ఎరుపు రంగు వస్తువులు, సంకేతాలను స్పష్టంగా గమనించే అవకాశాలు ఉంటాయి. పొగ మంచు సమయంలో, వర్షం పడినప్పుడు ఎరుపు రంగు లైట్లను ఆన్ చేసుకుని వెళ్తుంటాయి వాహనాలు. ఎందుకంటే ఎరుపు రంగును దూరం నుంచి కూడా సులభంగా గుర్తించే వీలు ఉండటమే కారణం. అలాగే ఎత్తైన భవనాలు, టవర్లపైనా ఎరుపు రంగు లైట్ ఉంచడానికి కారణం కూడా ఇదే. ఆకాశంలో వెళ్లే విమానాలు, హెలికాప్టర్ లు ఈ రెడ్ లైట్ ను సుదూరం నుంచి గమనించే వీలు ఉంటుంది.
ఎరుపు రంగు చరిత్ర ఏంటి?
హంటర్ ల్యాబ్ లో ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం, ఎరుపు రంగుకు 40 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పురాతన కాలంలో వేటగాళ్లు, కళాకారులు ఎరుపు రంగునే ఉపయోగించి గుహల్లో, బండరాళ్లపై బొమ్మలు గీసే వారు. గుహల్లోని గోడలపై కనిపించే శతాబ్దాల నాటి పెయింటింగ్ లను ఎరుపు రంగుతో కనిపించడానికి ఇదే కారణం. అలాగే పురాతన కాలంలో ప్రజలు తమ కుటుంబ సభ్యులు, బంధువుల మృతదేహాలకు ఎరుపు రంగు పొడిని పూసేవారని చరిత్ర చెబుతోంది. దుష్టశక్తుల నుంచి వారి ఆత్మను రక్షించుకోవడానికి ఇలా చేసేవారని ఆధారాలు లభించాయి.
ఎరుపు రంగు అంటే కేవలం ప్రమాదకరం మాత్రమే కాదు
ఎరుపు రంగు ప్రమాదానికి సంకేతంగా మాత్రమే చూడొద్దని పాశ్చాత్య నాగరికతలు తెలియజేస్తున్నాయి. పాశ్చాత్య నాగరికతలో రెడ్ కలర్ ను ప్రేమ రంగుగా చూసే వారు. ఆసియా సంస్కృతిలో, ఎరుపు రంగును అదృష్టానికి, ఆనందానికి ప్రతీకగా భావిస్తారు.
ఎరుపు రంగు ఫుడ్స్ ను ఇష్టపడటానికి కూడా ఇదే కారణం
ఎరుపు రంగుకు ఉన్న విశేషమైన ప్రత్యేకత వల్ల ఆ రంగు చూడగానే ఆకర్షిస్తుంది. రెడ్ కలర్ దుస్తులు, వస్తువులు, రెడ్ కలర్ రోజ్ ఇలా అన్నీ చూడగానే ఆకట్టుకునేలా కనిపిస్తుంటాయి. ఇతర రంగుల్లో కనిపించే ఆహార పదార్థాల కంటే కూడా ఎరుపు రంగు ఆహార పదార్థాలకు ఎక్కువగా ఆకర్షితులు అవడానికి కూడా ఇదే కారణమని సైన్స్ చెబుతోంది.
Viral Video: ట్రెడ్‌మిల్ చేస్తూ కుప్ప కూలిన యువకుడు, గుండెపోటుతో మృతి - వైరల్ వీడియో
Viral News: టాబ్లెట్ అనుకుని ఎయిర్‌పాడ్ మింగేసిన మహిళ, కడుపులో వినిపించిన శబ్దాలు
Spanish Man Arrest: లైవ్‌లో రిపోర్టర్‌కు లైంగిక వేధింపులు, వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
Flight: విమానం బాత్రూములో ఓ జంట పాడుపని, సిబ్బంది డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికుల అరుపులు
Viral Video: ఈ వీడియో చూస్తే మందుబాబుల గుండెలు ధడేల్, రోడ్లపై పారిన 2 మిలియన్ లీటర్ల వైన్
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్ 279
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?
/body>