Alcohol Side Effects: ఆల్కహాల్ సేవించిన తర్వాత కొందరికి వాంతులు ఎందుకు అవుతాయి?
Dangers of alcohol: ఆల్కహాల్ సేవించాక వాంతులు కావటానికి రకరకాల కారణాలు ఉంటాయి. శరీర తత్వాన్ని బట్టి కారణాలు వేరుగా ఉంటాయి. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని, పరిష్కరించుకోవటం, ముందు జాగ్రత్త పడటం అవసరం.
Why Do Some People Vomit After Consuming Alcohol: ఆల్కహాల్ సేవించాక వాంతులు కావటానికి రకరకాల కారణాలు ఉంటాయి. శరీర తత్వాన్ని బట్టి కారణాలు వేరుగా ఉంటాయి. కొందరు ఆల్కహాల్ తక్కువగా తాగినప్పటికి వారికి వాంతులవుతాయి. వారిలో ఆల్కహాల్ తట్టుకునే శక్తి తక్కువగా ఉండొచ్చు లేదా ఏమైనా ఆరోగ్య సమస్యలు అందుకు కారణం కావొచ్చు. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని, పరిష్కరించుకోవటం, ముందు జాగ్రత్త పడటం అవసరం. మందు తాగిన వారిలో కొందరికి వాంతులు అవటానికి సాధారణంగా కనిపించే కారణాలు ఇవి:
1. ఆల్కహాల్ అధికంగా సేవించటం
తక్కువ సమయలో ఒకేసారి ఎక్కువగా ఆల్కహాల్ సేవించటం వల్ల, అది విషపూరితంగా మారి, శరీర జీవక్రియ మీద ఒత్తిడి పెరుగుతుంది, తద్వారా, శరీరంలో రక్షణ వ్యవస్థ మీద కూడా ఒత్తిడి పెరిగి, అది వాంతులకు కారణమవుతుంది.
2. జీర్ణాశయ గోడలు (lining) దెబ్బతినటం
ఆల్కహాల్‌కు జీర్ణాశయ లైనింగ్‌పై ఒత్తిడి కలిగించే సామర్థ్యం ఉంటుంది. తద్వారా, ఇది వాంతులకు కారణమవుతుంది. సాధారణంగా, ఇది అసిడిటీ, గ్యాస్టిక్ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
3. ఆల్కహాల్ విషపూరితంగా మారటం
ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో సేవించినపుడు, అది విషపూరితంగా మారుతుంది. ఇది బయటకు వచ్చే టైంలో వాంతులు అవుతాయి. దీనివల్ల ప్రాణానికే ప్రమాదం కావచ్చు. ఎవరైనా ఈ సమస్య ఎదుర్కుంటుంటే వెంటనే హాస్పిటల్ కు వెళ్లటం అత్యవసరం.
4. ఆల్కహాల్ ను వేరే మెడిసిన్ తో కలిపి తాగితే
ఆల్కహాల్ ను కొన్ని రకాల మెడిసిన్ తో, డ్రగ్స్ తో కలిపి వాడినపుడు వాంతులు అవుతాయి. ఆ డ్రగ్ ను బట్టి తీవ్రత ఉంటుంది. ఇలా చేయటం కొన్ని సార్లు ప్రాణానికే ప్రమాదం కావచ్చు. మందులు వాడుతున్నపుడు ఆల్కహాల్ సేవించాలంటే మీ డాక్టర్ ను సంప్రదించటం తప్పనిసరి.
5. డీహైడ్రేషన్
ఆల్కహాల్ ఒక డైయూరెటిక్. అంటే, అది శరీరంలో మూత్రం ఎక్కువ స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల మూత్రానికి ఎక్కువగా వెళ్లటం వల్ల, శరీరంలో నీటి స్థాయి తగ్గిపోతుంది. ఇది డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది. డీహైడ్రేషన్ కూడా వాంతులకు ఒక కారణం కావొచ్చు.
6. కదిలే వాహనంలో ఉండటం
ఆల్కహాల్ సేవించిన తర్వాత వాహనంలో వెళ్లటం వల్ల కడుపులో తిప్పుతుంది. దీన్ని మాషన్ సిక్నెస్ అంటారు. ఇలా తిప్పటం వల్ల అది వాంతులకు కారణమవుతుంది.
7. ఆరోగ్య సమస్యలు
అసిడిటీ, జీర్ణక్రియ సంబంధిత సమస్యల వంటివి ముందు నుంచే ఉన్నవారిలో ఎక్కువగా, ఆల్కహాల్ సేవించిన తర్వాత వాంతులవటానికి కారణమవుతుంది. ఇది కొంతమందిలో వారి బరువు, శరీరతత్వం వంటి అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది.
ఆల్కహాల్ న్ తట్టుకునే శక్తి ఒక్కొకరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరు ఆల్కహాల్ తక్కువగా తాగినప్పటికి వారికి వాంతులవుతాయి. వారిలో ఆల్కహాల్ తట్టుకునే శక్తి తక్కువగా ఉండొచ్చు లేదా ఏమైనా ఆరోగ్య సమస్యలు అందుకు కారణం కావొచ్చు. ఆల్కహాల్ ను సేవించేటపుడు, మితిమీరి కాకుండా, బాధ్యతాయుతంగా తాగటం అవసరం. అలాగే, వాంతులు మాటిమాటికీ, ఎక్కువగా అవుతూ ఉన్నా, అది వేరే ఆరోగ్య సమస్యలకు దారి తీసినా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
నోట్: ఇక్కడ చర్చించిన అంశాలు కేవలం మీ అవగాహన కొరకు మాత్రమే.. మీకు ఉన్న మరిన్ని అనుమానాలను దగ్గర్లో ఉన్న వైద్యులను సంప్రదించి మాత్రమే నిర్ణయం తీసుకోండి.