By: Ram Manohar | Updated at : 07 Jul 2022 05:01 PM (IST)
హోల్‌లో పడిపోయిన బండి తాళాలను ఓ పిల్లి తీసి ఓనర్‌కు అందించింది
ఇంటర్నెట్‌లో కంటెంట్‌కు కొదవే లేదు. ఓపిక ఉండాలే కానీ ఎంత సేపైనా అలా చూస్తూ ఉండిపోవచ్చు. ముఖ్యంగా కొన్ని వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతాయ్. రోజుకో వీడియో కచ్చితంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. ఓ మహిళ బండి కీస్ పొరపాటున ఓ హోల్‌లో పడిపోయాయి. ఆ తాళాలు బయటకు తీసేందుకు ఆ మహిళ ఎన్నో పాట్లు పడింది. ఈఇబ్బందులు చూడలేక, ఆమె పెంచుకుంటున్న పిల్లి అక్కడికి వచ్చింది. యజమానికి సాయం చేయాలని తానూ ఆ హోల్‌లో కాళ్లు పెట్టి కీస్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించింది. ఇది చూసి ఆశ్చర్యపోయిన ఆమె వెంటనే వీడియో తీసింది. ఇది సోషల్ నెట్‌వర్క్ రెడిట్‌లో పోస్ట్ చేసింది. అప్పటి నుంచి నెట్టింట తెగ షేర్ అవుతోంది. ఆ మహిళకు ఓ బేబీ ఉంది. ఆ చిన్నారి కీస్‌తో ఆడుకుంటూ హోల్‌లో పడేసింది. అది తీసేందుకు పిల్లి చేసిన ప్రయత్నం నవ్వులు పూయిస్తోంది.
ఆ హోల్‌లో నుంచి తాళాలు బయటకు తీసేందుకు పడిన కష్టమెంతో వీడియోలో కనిపించింది. ఇందుకోసం ఆమె ఓ కర్రను కూడా వినియోగించింది. తరవాత ఉన్నట్టుండి ఓ నల్ల పిల్లి వచ్చింది. చాలా సేపు కష్టపడి చివరకు ఆ తాళాలు బయటకు తీసి ఓనర్‌కు అందించింది. ఈ వీడియో చూసిన వాళ్లు "అమేజింగ్" అని కామెంట్ చేస్తున్నారు.
ఢిల్లీ మెట్రో రైల్లో ముద్దులతో మైమరిచిపోయిన జంట, వైరల్ అవుతున్న వీడియో
Viral Video: ట్రెడ్మిల్ చేస్తూ కుప్ప కూలిన యువకుడు, గుండెపోటుతో మృతి - వైరల్ వీడియో
Viral News: టాబ్లెట్ అనుకుని ఎయిర్‌పాడ్ మింగేసిన మహిళ, కడుపులో వినిపించిన శబ్దాలు
Spanish Man Arrest: లైవ్‌లో రిపోర్టర్‌కు లైంగిక వేధింపులు, వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
Flight: విమానం బాత్రూములో ఓ జంట పాడుపని, సిబ్బంది డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికుల అరుపులు
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక
ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌తో భారత్‌కి సంబంధం లేదు, నిజ్జర్ హత్యపై జైశంకర్ క్లారిటీ
/body>