Viral News: మట్టి కుండలో 90 కోబ్రాలు- ధైర్యముంటే వీడియో చూడండి!
Viral News: ఓ ఇంట్లో ఏకంగా 90 నల్ల తాచులు కనిపించడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Viral News:
సాధారణంగా ఒక్క పాము చూస్తేనే మనకు భయం వేస్తుంది. అలాంటిది 90 పాములు ఒకేసారి కనిపిస్తే మన గుండె ఆగిపోతుంది. అయితే ఓ వ్యక్తి ఇంట్లో ఉన్న పాత కుండను తెరిచి చూశాడు. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఎందుకంటారా? ఆ కుండలో ఒకటి రెండు కాదు.. కుప్పలు తెప్పలుగా పాములు కనిపించాయి. ఇదెక్కడ జరిగిందంటే?
ఇదీ జరిగింది
#Ambedkarnagar : एक घर में मिट्टी के बर्तन के अंदर मिले सैकड़ों जहरीले सांप, ग्रामीणों में दहशत pic.twitter.com/pd2hymRISR
— Nidhi Tiwari (@NidhiTiwari2210) May 11, 2022
ఉత్తర్ప్రదేశ్ అంబేడ్కర్ నగర్ జిల్లాలో ఒకేచోట భారీగా పాములు కనిపించటం కలకలం సృష్టించింది. మదువానా గ్రామంలోని ఓ ఇంట్లో పాత కుండలో పాములు బయటపడ్డాయి.
మదువానా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లోని పాత మట్టి కుండను తెరిచి చూశాడు. అయితే ఆ కుండలో కుప్పలు తెప్పలుగా పాములు కనిపించాయి. దీంతో ఆ యజమాని షాక్‌కు గురై గ్రామస్థులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఆ కుండలో బయటపడ్డ 90 కోబ్రా పాములను చూసేందుకు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. కొంతమంది ఈ పాములను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే ఈ తాచు పాములను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని అడవిలో వదిలేశారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. పాములు భూమిలో, వెచ్చని ప్రదేశాలలో ఎక్కువ ఉంటాయని, ఇంటి యజమానులు ఈ కుండను ఎన్నో ఏళ్లుగా పట్టించుకోకపోయేసరికి పాములు అక్కడ చేరి ఉంటాయని అటవీ శాఖ అధికారులు అన్నారు.
వీడియో వైరల్
ప్రస్తుతం ఈ పాముల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇన్ని పాములను చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. అయితే ఆ మట్టికుండను ఇన్నాళ్లు ఎందుకు తెరవలేదు? అని కొంతమంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేశారు. మరి కొంతమంది ఇప్పటికైనా కుండ తెరిచాడు సంతోషం అంటూ స్పందిస్తున్నారు.
Also Read: Watch Video: పార్లమెంటులో గానా బజానా- ఇందుకేనా చట్టసభలు అంటూ ప్రజాగ్రహం!
Also Read: Marital Rape: భార్యపై బలవంతపు శృంగారంపై దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?