Viral News: మనవరాలి కోసం హెలికాప్టర్- ఆడపిల్ల పుడితే గట్లుంటది మరి ఆనందం!
తన మనవరాలికి ఓ తాత్యయ్య అదిరే స్వాగతం ఇచ్చాడు. ఏకంగా హెలికాప్టర్‌లో తనను ఇంటికి తీసుకువచ్చాడు.
ఇంట్లో ఆడపిల్ల పుడితే భారంగా భావించే రోజులు పోయాయ్. ఇప్పుడు మగబిడ్డ కంటే ఆడిపిల్ల పుడితే గారబంగా చూసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఆడబిడ్డలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాలు కూడా అమలు చేస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా వివక్ష కొనసాగుతోంది. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం కచ్చితంగా అలాంటి వాళ్లలో కూడా మార్పు వస్తుంది. తనకు మనవరాలు పుట్టిందని తెలిసి ఏకంగా హెలికాప్టర్‌లో తనని ఇంటికి తీసుకువచ్చాడు ఓ పెద్దాయన. అయితే ఆయన బడా వ్యాపారవేత్తో, సినీ ప్రముఖుడో కాదు. నాగలి పట్టి పొలం దున్నే ఓ రైతు.
Maharashtra | Ajit Pandurang Balwadkar, a farmer from Balewadi hired a helicopter to bring his newborn granddaughter and daughter-in-law to his house in Balewadi from the maternal house of the daughter-in-law in Shewalwadi in Pune. (26.04) pic.twitter.com/T9dR8gxVqe
— ANI (@ANI) April 26, 2022
అదిరే స్వాగతం
మహారాష్ట్ర పుణెలోని బాలువాడి ప్రాంతానికి చెందిన అజిత్ పాండురంగ్ బల్వాడ్కర్‌కు మనవరాలు పుట్టిందని తెలిసి ఆనందంలో ఉప్పొంగిపోయాడు. మంగళవారం ఆ పాపను అమ్మమ్మ వాళ్లింటి నుంచి తీసుకురావడానికి హెలికాప్టర్ బుక్ చేశాడు. తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నాడు.
ఇలానే
మహారాష్ట్ర పుణెలో కొద్ది రోజుల క్రితం తన కుతూరికి ఓ నాన్న కూడా ఇలానే గ్రాండ్ వెల్ కమ్ చెప్పాడు. షేల్గావ్ కు చెందిన విశాల్ జరేకర్‌కు ఇటీవల కూతురు పుట్టింది. దీంతో తెగ సంబర పడిపోయాడు. ఎందుకంటే తమ వంశంలో తొలిసారి ఒక ఆడపిల్ల పుట్టింది. ఇంకేముంది తన కూతురికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పాలని డిసైడై పోయాడు.
#WATCH Shelgaon, Pune | Grand Homecoming ! A family brought their newborn girlchild in a chopper
— ANI (@ANI) April 5, 2022
We didn't have a girlchild in our entire family. So, to make our daughter's homecoming special, we arranged a chopper ride worth Rs 1 lakh:Vishal Zarekar,father
(Source: Family) pic.twitter.com/tA4BoGuRbv
వెంటనే తన కూతురి కోసం ప్రత్యేక ఛాపర్ రైడ్‌ను ఏర్పాటు చేశాడు. తన ఇంటి సమీపం వరకు హెలికాప్టర్‌లో వచ్చారు. .ఆ తర్వాత బంధువులు, స్నేహితుల మధ్యలో తన కూతురికి స్పెషల్‌గా వెల్‌కమ్ చెప్పాడు. ఇందుకు రూ.లక్ష ఖర్చు పెట్టాడు ఆ తండ్రి.
Also Read: Weather Impact on Indian Economy: ఎంత పని చేశావ్ సూరీడు- నీ వల్ల గంటకు రూ.5 వేల కోట్లు నష్టం!
Also Read: Also Read: PM MOdi On Petrol Prices : పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించండి - సీఎంలకు ప్రధాని సూచన !