Weather Impact on Indian Economy: ఎంత పని చేశావ్ సూరీడు- నీ వల్ల రోజుకు రూ.5 వేల కోట్లు నష్టం!
Weather Impact on Indian Economy: దేశ ఆర్థికంపై భానుడు కూడా ప్రభావం చూపుతాడు తెలుసా? గంటకు రూ. 22 లక్షలు, రోజుకు 5 వేల కోట్లు సూర్యుడి వల్ల దేశానికి నష్టం కలుగుతుందట.
Weather Impact on Indian Economy: దేశంలో భానుడి భగభగలు మాములుగా లేవు. ఏప్రిల్ నెలలోనే ఎండలు ఇలా ఉంటే, మే లో పరిస్థితి ఏంటోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భానుడి ప్రతాపానికి ఐదు దేశాల్లో గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున జనాభా అధిక వేడిని భరించాల్సి వచ్చిందని ది లాన్సెట్ నివేదకలో తేలింది. ఆ ఐదు దేశాల్లో భారత్ కూడా ఒకటి.
122 ఏళ్లలో
2022 మార్చి - ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. 1901 తర్వాత భారత్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసిన మార్చి నెల.
కార్మికులు
ఎండ వేడిమి వల్ల భారత్ ఏడాదికి దాదాపు 101 బిలియన్ (10,100 కోట్ల) పని గంటలు కోల్పోతుందని 2021 డిసెంబర్‌లో ప్రచురితమైన నేచర్ జర్నల్ వెల్లడించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఇది అత్యధికం.
కీలక రంగాలు
భానుడి ప్రతాపం కారణంగా వ్యవసాయం, భవన నిర్మాణం వంటి పనులు చేసేందుకు దాదాపు కుదరటం లేదు. ఈ రెండు రంగాలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది.
కోల్పోయిన పని గంటలను మనుషులతో పోల్చితే.. అంటే ఒక్కో వ్యక్తి రోజుకు 8 గంటలు పని చేస్తే.. భారత్ 3.5 కోట్ల మంది చేసే పనిని ప్రతి ఏడాది కోల్పోతోంది.
వ్యవసాయంలో
2020 - భారత్ దాదాపు 67 బిలియన్ (6,700 కోట్ల) వ్యవసాయ పని గంటలు కోల్పోయింది. అంటే దాదాపు 39 బిలియన్ డాలర్లు (₹2.9 లక్షల కోట్లు, 2020 ధరల ప్రకారం) Source: Lancet
2030 వరకు ఎండ వేడిమి వల్ల దేశం కోల్పోయే పని గంటలు
రంగం |
కోల్పోయే పని గంటలు (%) - 2030 అంచనా |
వ్యవసాయం |
9.04 |
తయారీ రంగం |
5.29 |
నిర్మాణం |
9.04 |
సర్వీసులు |
1.48 |
2030 - ఎండ వేడిమి వల్ల కోల్పోయే పని గంటలను లెక్కిస్తే దేశ జీడీపీలో 2.5- 4.5 శాతం నష్టం కలుగుతోంది.
McKinsey Report in 2020 - 2030కి భారత్.. ఎండ వేడిమి వల్ల 250 బిలియన్ డాలర్లు (రూ. 19.17 లక్షల కోట్లు) నష్టపోయే అవకాశం ఉంది.
రోజువారీ నష్టం – 2030కి రూ. 5,242 కోట్లు
గంటకి నష్టం – Rs. 22 లక్షలు
ఉష్టోగ్రతలు పెరిగితే
ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే వ్యవసాయ ఉత్పాదకత, సముద్ర మట్టాలు పెరగడం, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటి వల్ల భారత్ తన జీడీపీలో దాదాపు 3 శాతం నష్టపోయే అవకాశం ఉంది. (Source: Report published by the Overseas Development Institute (ODI) think tank)
వరి నష్టం - ఎండ వల్ల దేశంలో వరి ఉత్పాదన 10 నుంచి 30 శాతం తగ్గే అకాశం ఉంది. (ఉష్టోగ్రతలు 1- 4 డిగ్రీల వరకు పెరిగితే)
మొక్క జొన్న నష్టం- ఎండ వల్ల దేశంలో మొక్క జొన్న ఉత్పాదన 25 నుంచి 70 శాతం తగ్గే అవకాశం ఉంది. (ఉష్టోగ్రతలు 1- 4 డిగ్రీల వరకు పెరిగితే)