PM Modi Meeting: కరోనాపై అలసత్వం వద్దు, అలర్ట్‌గా ఉందాం- సీఎంలకు మోదీ సలహా
PM Modi Meeting: కరోనా కేసులు పెరుగుతోన్న వేళ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
PM Modi Meeting: దేశంలో కరోనా తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ‍్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతోన్న వేళ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ఆయన సూచించారు. ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున అలసత్వం వహించరాదని కోరారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనాను భారత్ దీటుగా ఎదుర్కొందని మోదీ అన్నారు.
It's a matter of pride for every citizen that 96% of our adult population has been vaccinated with the first dose of the vaccine and 85 % of the eligible population above 15 years of age inoculated with the second dose of COVID-19 vaccine: PM Modi pic.twitter.com/g3HRLWht1r
— ANI (@ANI) April 27, 2022
వ్యాక్సినేషన్
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని మోదీ అన్నారు. మన దేశ వయోజన జనాభాలో 96% మంది మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైందని వెల్లడించారు. పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
Also Read: PM MOdi On Petrol Prices : పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించండి - సీఎంలకు ప్రధాని సూచన !