Viral News: ఇదో జుగాడ్ కారు! ఎంచక్కా పడుకొని షికారుకు వెళ్లొచ్చు!
కొందరు కార్లలో దూరం ప్రయాణాలు చేస్తుప్పుడు పడుకోవడానికి వీలుండదు. ఎక్కువ సేపు కూర్చుని ప్రయాణించడం వల్ల కొన్ని సార్లు శరీరంలోని కొన్ని అవయవాలు పట్టేస్తాయి కూడా.
కొందరు కార్లలో దూరం ప్రయాణాలు చేస్తుప్పుడు పడుకోవడానికి వీలుండదు. ఎక్కువ సేపు కూర్చుని ప్రయాణించడం వల్ల కొన్ని సార్లు శరీరంలోని కొన్ని అవయవాలు పట్టేస్తాయి కూడా. అందుకు ప్రత్యామ్నాయంగా ఏదోకటి చేయాలనుకునే వారు చాలా మంది ఉంటారు. వారిలో దీపక్ గుప్తా అనే వ్యక్తి ఒకరు.
ఆయన అందరి కారు లాగా తన కారు కూడా ఉంటే ఏం బాగుటుంది అనుకున్నాడో ఏమో! ఆలోచన వచ్చిందే ఆలస్యం కారును కాస్త మార్చిపడేశాడు. అనుకుంటే సాధ్యం కానిది ఏది లేదని ఆయన చేసిన పనితో రుజువు చేశాడు. తాజాగా ఆయన చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్తా వైరల్ గా మారింది. దీపక్ గుప్తా ఆయన మారుతి సుజుకి కారు లోపల ఉన్న సీట్లను తీసేసి మొత్తం బెడ్ వేసి హాయిగా ప్రయాణిస్తున్నట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడి ఎలాంటి అసౌకర్యం ఫీల్ అవకుండా కూర్చుని వెళ్లవచ్చు..పడుకొని వెళ్లవచ్చు అంటూ రాసుకొచ్చాడు. అతను ఏర్పాటు చేసిన పరుపు మీద ఇద్దరు పడుకొవచ్చు. అవసరం లేదు అనుకున్నప్పుడు దానిని తీసివేసి కూర్చోవచ్చు కూడా.
ఇలా తను, తన కుటుంబం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎలా కావాలంటే అలా వెళ్లవచ్చని చెప్పుకొచ్చాడు. అసలు ఇలా ఎందుకు మార్చవలసి వచ్చిందని ఆయనను కొందరు అడిగితే..నేను నా కుటుంబంతో చాలా సార్లు ప్రయాణించాను. కానీ కొన్ని సందర్భాల్లో, ఎక్కువ దూరం ప్రయాణించవలసి వచ్చిన సందర్భాల్లో కూడా నాతో పాటు నా కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొన్నాం.
ఎక్కువ సేపు కూర్చుని ఉండటం వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు అసౌకర్యానికి గురౌడంతో అనారోగ్యం పాలవ్వాల్సి వచ్చిందని ఆయన వివరించారు. తన కారు లోపల ఇప్పుడు ఇలా పరుపు వేసి కొన్ని మార్పులు చేయడం వల్ల ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా వెళ్లిపోతున్నట్లు ఆయన తెలిపారు.
అంతే కాకుండా దీనిని చూసిన చాలా మంది తనని అభినందిస్తున్నారని కూడా పేర్కొన్నారు. చాలా మంది తమ కార్లను కూడా ఇలా మార్పులు చేసి ఉపయోగించుకుంటామని తనతో చెప్పినట్లు దీపక్ పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ దీపక్ మార్చిన కారు ప్రస్తుతం కారవాన్ గానూ ఉపయోగపడుతుంది. కారుగానూ ఉపయోగపడుతుంది.
ఇక్కడంటే ఇలాంటి కారవాన్ల గురించి ప్రత్యేకంగా తెలియదు కానీ, ఇలాంటివి విదేశాల్లో ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నట్లు కూడా దీపక్ వివరించారు.