Truck Falls in River: వీడియో - మెరుపు వేగంతో వంతెన మీద నుంచి నదిలోకి దూసుకెళ్లిన ట్రక్
లెటర్స్, పార్శిళ్లతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Truck Falls in River: అతి వేగం ఎప్పటికీ ప్రమాదకరమే. మితిమీరిన వేగం వల్ల ఎప్పుడు ఎలా ప్రమాదంలో చిక్కుకుంటామో తెలీదు. రోడ్డు ఖాళీగా ఉన్నా సరే వేగంగా దూసుకెళ్లడం చాలా డేంజర్. అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటనే ఇందుకు నిదర్శనం.
యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ (USPS) మెయిల్‌కు చెందిన ఓ ట్రక్కు బోస్టన్‌లో ప్రమాదానికి గురైంది. అతివేగంతో దూసుకెళ్తున్న ఆ ట్రక్కు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టి నేరుగా చార్లెస్ నదిలో పడిపోయింది. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో కూడా రికార్డైంది. హాలీవుడ్ సన్నివేశాన్ని తలపిస్తున్న ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్రక్కు డ్రైవర్ లక్కీగా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాద సమాచారం తెలియగానే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరారు. డ్రైవర్‌ను సురక్షితంగా ట్రక్కు నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో అక్కడ చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఎటుచూసినా మంచే ఉంది. నదిలో నీళ్లు కూడా చాలా చల్లగా ఉన్నాయి. అయినా సరే అధికారులు వెనకడుగు వేయకుండా డ్రైవర్‌ను రక్షించారు. అయితే, ఆ ట్రక్కులో ఉన్న ఉత్తరాలు, పార్శిళ్లన్నీ నీట మునిగాయి.
Also Read: రణరంగంలో రొమాన్స్, ఉక్రెయిన్ మహిళలకు రష్యా జవాన్లు వింత రిక్వెస్టులు, ఇదిగో ఇలా..
మసాచుసెట్స్ స్టేట్ పోలీస్ అసోసియేషన్ (The State Police Association of Massachusetts) తమ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రమాదం జరిగే సమయానికి ఫైర్ ఫైటర్లు అక్కడే ఉన్నారని, దీంతో వారు వెంటనే ప్రమాద స్థలికి చేరి సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. గాయపడిన డ్రైవర్‌ను సమీపంలో ఉన్న ఉమెన్స్ హాస్పిటల్‌కు తరలించారు.
View this post on Instagram
Here’s what the scene looks like in Weston. pic.twitter.com/TTkKWmNbL2
— Mass State Police (@MassStatePolice) February 26, 2022
Also Read: వొలోదిమిర్ జెలెన్‌స్కీ - నాడు నవ్వులు పంచిన కమెడియన్, నేడు ప్రజల కన్నీటిని తుడిచే నాయకుడు