అన్వేషించండి

Viral News: 'పావుకిలో ఆలుగడ్డలు పోయాయి' - పోలీసులకు ఓ మందుబాబు ఫిర్యాదు, యూపీలో వింత కేసు

UP News: యూపీలో పోలీసులకు ఓ వింత ఫిర్యాదు వచ్చింది. ఓ మందుబాబు పావుకిలో ఆలుగడ్డలు పోయాయని ఫిర్యాదు చేశాడు. మద్యం మత్తులో అతను హల్చల్ చేయగా ఇది వైరల్‌గా మారింది.

UP Man Complaint To Police Over Missing Potatoes: అది దీపావళి ముందురోజు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇంతలో వారికి తమ ఇంట్లో దొంగతనం జరిగిందంటూ ఓ వ్యక్తి కాల్ చేశాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతని ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అతను చెప్పింది విన్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. తన ఇంట్లో పావుకిలో బంగాళదుంపలు పోయాయని.. అసలే వంట కోసం వాటిని ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టానని చెప్పాడు. తాను మందు తాగి వచ్చేసరికి వాటిని ఎవరో దొంగిలించారని దొంగను పట్టుకుని వాటిని తనకు ఇప్పించాలని హల్చల్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని (UP Police) పోలీసులకు తాజాగా ఓ వింత కేసు వచ్చింది. అక్టోబర్ 30వ తేదీన ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్ 112కి ఓ కాల్ వచ్చింది. హర్దోయ్ జిల్లా మన్నపుర్వాలోని విజయ్‌వర్మ అనే వ్యక్తి వారికి ఫోన్ చేసి తన ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఏమేం పోయాయని ప్రశ్నించారు.?. ఈ క్రమంలో అతను చెప్పిన సమాధానం విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తన ఇంట్లో తాను పొట్టు తీసి పెట్టుకున్న పావుకిలో ఆలుగడ్డలు పోయాయని చెప్పాడు. దీంతో కంగుతిన్న పోలీసులు 'ఏంటీ తాగున్నావా.?' అంటూ నిలదీశారు. దానికి అవునని సమాధానం చెప్పిన విజయ్‌వర్మ.. 'రోజంతా కష్టపడి సాయంత్రం పూట ఓ పెగ్గు వేసుకున్నా. ఆ తర్వాత వంట చేసుకోవడానికి ఆలుగడ్డలను ఉడకబెట్టి.. పొట్టు కూడా తీసి ఉంచాను. వెంటనే వాటిని వెతికి పట్టుకురావాలి.' అంటూ పోలీసులను దబాయించాడు. అంతా విన్న పోలీసులు సదరు మందుబాబుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి పిచ్చి ఫిర్యాదులు చెయ్యొద్దని హెచ్చరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

Also Read: TamilNadu Politics: విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget