Kumbh Mela 2025 : కుంభమేళాపై స్టీవ్ జాబ్స్ లేఖ ఖరీదు రూ.4.32 కోట్లు- సోషల్ మీడియాలో లెటర్ వైరల్
Kumbh Mela 2025 - Steve Jobs : దివంగత, ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 1974లో చేతితో రాసిన లేఖ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అందులో అతను కుంభమేళాను సందర్శించాలనే కోరికను వ్యక్తం చేశాడు.
![Kumbh Mela 2025 : కుంభమేళాపై స్టీవ్ జాబ్స్ లేఖ ఖరీదు రూ.4.32 కోట్లు- సోషల్ మీడియాలో లెటర్ వైరల్ Steve jobs letter on kumbh mela sold for Rs.43200000 Letter Viral Kumbh Mela 2025 : కుంభమేళాపై స్టీవ్ జాబ్స్ లేఖ ఖరీదు రూ.4.32 కోట్లు- సోషల్ మీడియాలో లెటర్ వైరల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/17/9f5a0ff4f66c247fed0cca7ba2f1601d1737113209593697_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kumbh Mela 2025 - Steve Jobs : ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో 45రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు జనవరి 13 నుంచి ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ మేళాకు ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఆపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, దివంగత స్టీవ్ జాబ్స్ (Steve Jobs) సతీమణి పావెల్ జాబ్స్ వెళ్లారు. కుంభమేళాకు వెళ్లాలనుకున్న తన భర్త స్టీవ్ జాబ్స్ కోరికను నెరవేర్చారు. ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేస్తుండొచ్చు. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయమేటంటే.. స్టీవ్ జాబ్స్ 1974లోనే కుంభమేళాకు వెళ్లాలనుకున్నారట. అందుకోసం స్టీవ్ 1974లో వేసిన ప్లాన్ కు సంబంధించిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖను ఇటీవలే బోన్హామ్స్ సంస్థ వేలం వేయగా.. 5 లక్షల డాలర్లకు పైగానే అమ్ముడుపోవడం చెప్పుకోదగిన విషయం.
వైరల్ అవుతోన్న స్టీవ్ జాబ్స్ కుంభమేళా టూర్ ప్లాన్ లెటర్
అప్పట్లో స్టీవ్ జాబ్స్ కుంభమేళా వెళ్లాలనుకున్నారని, అందుకు 1974లో ఓ ప్లాన్ కూడా చేశారని తాజాగా అతని చిన్ననాటి స్నేహితుడు టిమ్ బ్రౌన్ వెల్లడించారు. 19వ పుట్టిన రోజున స్టీవ్ జాబ్స్ తనకు రాసిన లేఖలో బౌద్ధమతం గురించి చెప్పారని.. భారత దేశంలో జరిగే కుంభమేళాకు వెళ్లాలని ఆశపడుతున్నట్లు చెప్పారన్నారు. టిమ్ బ్రౌన్ రాసిన లేఖకు ప్రతిస్పందనగా స్టీవ్ జాబ్స్ ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది. తన భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉందని, తాను చాలా సార్లు ఏడ్చానని కూడా ఆయన లేఖలో రాశారు. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కుంభమేళాకు భారత దేశానికి వెళ్లాలనుకుంటున్నాని చెప్పిన స్టీవ్.. మార్చిలో వెళ్తానని, కానీ దాని గురించి ఇంకా కచ్చితమైన ప్లాన్ లేదని తెలిపాడు. జాబ్స్ స్వయంగా తన చేతితో రాసిన ఈ లేఖను 2021లో వేలం వేయగా.. రూ.4.32 కోట్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది జాబ్స్ లోని ఆధ్యాత్మికతను వెలికితీసింది.
Steve Jobs letter to his friend about planning to visit Kumbh Mela in India.
— Kartik Jaiswal (@draken73jp) October 24, 2021
The thing to notice here is, he used the word "Shanti" before concluding. pic.twitter.com/s4yN2pupjr
నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించిన స్టీవ్
జాబ్స్ ఎప్పుడూ కుంభమేళాకు హాజరు కానప్పటికీ, అతను ఉత్తరప్రదేశ్ లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించాడు. నీమ్ కరోలి బాబా అంతకుముందు సంవత్సరమే మరణించాడని అతనికి ఆ తరువాత తెలిసింది. అయినప్పటికీ, జాబ్స్ కైంచి ధామ్ ఆశ్రమాన్ని ఎంచుకున్నాడు. అతను భారతదేశంలో ఏడు నెలలు గడిపాడు. సంస్కృతి, ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు.
కోరిక తీరకుండానే కనుమూసిన స్టీవ్ జాబ్స్
స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి ఆపిల్ కంపెనీని ప్రారంభించే కంటే 2ఏళ్ల ముందే ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆయన తన చిరకాల వాంఛ తీరకుండానే అక్టోబర్ 5. 2011న 56 ఏళ్ల వయసులో స్టీవ్ జాబ్స్ మృతి చెందాడు.
ప్రయాగ్ రాజ్ లో స్టీవ్ భార్య
స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ ఇటీవలే 40 మంది సభ్యుల బృందంతో ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె గురువు స్వామి కైలాసానంద గిరి ఆశ్రమంలో ఉన్నట్టు సమాచారం. ఆమె ఆమె ధ్యానం, క్రియా యోగా, ప్రాణాయామం వంటి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ... భారతీయ సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అనుభవిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)