అన్వేషించండి

Viral News: కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన కొడుకు ఏం చేశాడంటే?

Maharastra News: మహారాష్ట్రలో ఓ వ్యక్తి తనకు కాబోయే కోడలితో ప్రేమాయణం నడిపి ఆమెను గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఇది చూసి షాకైన కొడుకు జీవితంపై విరక్తితో సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాడు.

Maharastra Man Married Would Be Daughter In Law: వధువు వేరొకరిని ప్రేమించి పెళ్లి పీటల మీదే పెళ్లి ఆపిన ఘటనలు చూశాం. సరిగ్గా పెళ్లి సమయానికే వధువు వేరే వ్యక్తితో వెళ్లిపోయిన సందర్భాలూ చూశాం. కానీ మహారాష్ట్రలో (Maharastra) ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తనకు కాబోయే కోడలిని వరుడి తండ్రి వివాహం చేసుకోగా.. అది చూసి షాకైన కొడుకు విరక్తితో సన్యాసం మారేందుకు నిర్ణయించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ తండ్రి తన కొడుకు కోసం ఓ అమ్మాయిని చూశాడు. పెళ్లి తేదీ కూడా ఖరారు చేశాడు. వైభవంగా వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు భారీగా ఏర్పాట్లు చేసుకున్నాయి.

కోడలితో ప్రేమ వివాహం

అయితే, తనకు కాబోయే కోడలితో వరుడి తండ్రి ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలిసి ప్రేమాయణం సాగించి కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకుని.. నేరుగా పెళ్లి దుస్తుల్లోనే ఇంటికి వచ్చారు. ఇది చూసి వరుడితో పాటు అతని కుటుంబసభ్యులు, బంధువులు షాకయ్యారు. భార్య కావాల్సిన యువతి చేసిన మోసానికి, తండ్రి చేసిన ద్రోహానికి ఆ యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. జీవితంపై విరక్తి పెంచుకుని సన్యాసిగా మారేందుకు నిర్ణయించుకున్నాడు. మరో అమ్మాయిని తెచ్చి వివాహం చేస్తామని తండ్రి హామీ ఇచ్చినా ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయిందని ఆవేదన చెందాడు. తాను సన్యాసిగానే మారుతానని భీష్మించుకుకూర్చున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read: MP Brahmin Board : బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Embed widget