అన్వేషించండి

Pochamma: పాలు తాగుతున్న పోచమ్మ తల్లి! - ఆలయానికి భక్తుల క్యూ

Hyderabad News: ఆలయంలో పోచమ్మ అమ్మవారు పాలు తాగుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. మదీనాగూడలోని ఆలయంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

Pochamma Ammavaru Sips Milk In Madeenaguda Temple: పోచమ్మ అమ్మవారు పాలు తాగుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు అక్కడి ఆలయ పూజారులు. గత 3 రోజులుగా అమ్మవారు పాలు తాగుతున్నారంటూ గుర్తించి ఆలయం కమిటీకి తెలపగా వారు కూడా వచ్చి అమ్మవారు పాలు స్వీకరిస్తున్నట్లు గమనించి ఆశ్చర్యపోయారు. ఈ ఘటన శేరిలింగంపల్లి (Serlingampally) నియోజకవర్గంలోని మదీనాగూడలో (Madeenaguda) చోటు చేసుకుంది. గ్రామంలో శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయం ఉంది. స్వయంభువుగా వెలసిన పోచమ్మ తల్లి అమ్మవారికి ఇక్కడి స్థానికులు నిత్యపూజలు చేస్తారు.

ఆలయంలో అద్భుతం

అయితే, గత మూడు రోజులుగా పోచమ్మ అమ్మవారు భక్తులు సమర్పించిన పాలు తాగుతున్నట్లు ఆలయ పూజారి నవీన్ కుమార్ తెలిపారు. ఇదే విషయం ఆలయ కమిటీ సభ్యులకు తెలుపగా శుక్రవారం వారు స్వయంగా అమ్మవారికి చెంచాతో పాలు పట్టించారు. అమ్మవారు పాలను స్వీకరించినట్లు గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆలయానికి బారులు తీరారు. అధిక సంఖ్యలో పాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. ఇది అమ్మవారి మహిమే అంటూ భక్తులు పేర్కొంటున్నారు. అయితే, ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అమ్మవారు పాలు తాగడం వెనుక శాస్త్రీయ కారణాలు ఏమైనా ఉన్నాయా.? అనే దానిపై చర్చ సాగుతోంది.

Also Read: TG ECET Counselling: తెలంగాణ ఈసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget