అన్వేషించండి

Sri Krishna Janmashtami : పురాణాల్లో ఒక్కరు కాదు ఇద్దరు కృష్ణులు ఉన్నారని తెలుసా?

Krishna Janmashtami :మన పురాణాల్లో ఒక్కరు కాదు ఇద్దరు కృష్ణులు ఉన్నారని తెలుసా?పరుశురాముడకి హరిధనుస్సు ఇచ్చింది ఎవరు? రాముడిని ఆ ధనుస్సు ఎక్కుపెట్టమంటూ ఎందుకు పరుశురాముడు సవాల్ చేశాడు.

 Hindu Mythology: ఈరోజు కృష్ణాష్టమి. దేశవ్యాప్తంగా కృష్ణ భక్తులు ఆనందంతో పండుగ చేసుకుంటున్నారు. అయితే మన పురాణాల్లో మనకు తెలిసిన కృష్ణుడు మాత్రమే కాకుండా మరో కృష్ణుడు ఉన్నాడని చాలా మందికి తెలియదు. ఇంతకీ ఎవరతను అనే ఆశక్తి కలిగించే ఆ కథనం మీకోసం 

నైమిశారణ్యంలో మునులకు సూతుడు చెప్పిన పురాణాలు
పూర్వకాలంలో నైమిశారణ్యంలో చాలా కాలంపాటు యజ్ఞాలు జరిగాయి. ఆ సమయంలో అక్కడకు వచ్చిన సూతుడు అనే ముని అక్కడ ఉన్న మునులకు అనేక పురాణాలను చెప్పాడు. వాటిలో విష్ణుపురాణం కూడా ఉంది. విష్ణువు అవతారాలను గురించి ఆయన మునులకు చెబుతూ పరుశురామ అవతార కథలో భాగంగా తన తండ్రి జమదగ్నిని చంపిన క్షత్రియులను నాశనం చేస్తానంటూ పరశు రాముడు ప్రతిజ్ఞ చేయడం గురించి చెప్పాడు. అప్పటికే శివుడిని మెప్పించి పరశువు (గొడ్డలి) ఆయుధంగా పొంది పరశురాముడుగా మారిన ఆయన మరొకసారి శివుడిని పూజించి భార్గవ అస్త్రాన్ని వరంగా సాధించాడు. అప్పటి నుంచి ఆయన పేరు భార్గవ రాముడుగా కూడా పిలుస్తున్నారు. 

శివుడితో పాటే కృష్ణుడు
ఆ శక్తులతోపాటు హరి శక్తి కూడా కావాలని భావించిన పరుశురాముడు గోలోకంలో ఉండే కృష్ణుడి వద్దకు వెళ్లి ఆయనను పూజించి కృష్ణ కవచాన్ని పొందాడు. అది శరీరంపై ఉండగా ఎలాంటి ఆయుధం కూడా పరశురాముడిని తాకలేదు. దానితో పాటే కృష్ణుడు ఒక సాటిలేని ధనుస్సును కూడా పరుశురాముడుకి ఇచ్చి అది అజేయమైన విల్లు అని చెప్పాడు. పరుశురాముడు చేయబోతున్న క్షత్రియ సంహారం తరువాత రానున్న రామావతారంలో ఆ ధనుస్సును తిరిగి తీసుకుంటానని కృష్ణుడు చెబుతాడు. అలా వరాలు పొందిన పరుశురాముడు 21 సార్లు ప్రపంచం అంతా తిరిగి క్షత్రియులను చంపి ఆ రక్తంతో ఐదు చెరువులను నింపాడు. అవే శమంతక పంచకంగా పిలుపస్తారు. 

ఆ తరువాత పరుశురాముడు తాను సంపాదించిన భూమిని అంతా కశ్యప మహర్షికి దానం చేసి గోకర్ణంలో తపస్సుకు వెళ్ళిపోయాడు. పరుశురాముడికి దొరకకుండా తప్పించుకున్న కొద్దిమంది క్షత్రియులకు కశ్యపుడు ఆ భూమిని పంచి ఇచ్చాడు. దానితో మళ్ళీ రాజవంశాలు ఏర్పడ్డాయి. అలా వచ్చిన వాటిలోని సూర్యవంశంలోనే విష్ణువు మళ్ళీ రాముడుగా పుట్టాడు. సీతా స్వయంవరంలో రాముడి శివ ధనస్సును ఎక్కుపెట్టినప్పుడు అది విరిగిపోయిన శబ్దం ఎక్కడో తపస్సు చేసుకుంటున్న పరశురాముడి చెవులకు తాకింది. 

దీంతో మళ్ళీ క్షత్రియ సంహారం చెయ్యాలని బయలుదేరి మిథిలకు చేరి రాముడిని తన దగ్గర ఉన్న హరి ధనుస్సును ఎక్కుపెట్టాలంటూ సవాల్ చేశాడు. రాముడు ఆ విల్లును తీసుకోవడానికి చేతిని చాపి పరుశురాముడిని తాకగానే ఆయన విష్ణువు అవతారమని తెలిసిపోయింది పరుశురాముడికి. అలాగే ఆయనలోని దైవాంశ కూడా రాముడిలోకి వెళ్ళిపోయింది. గతంలో గోలోక కృష్ణుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఆ విల్లును రాముడికి ఇచ్చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు పరుశురాముడు. 

గోలోకం లో ఉండే కృష్ణుడు ఎవరు?
ఈ కథ చెబుతున్న సూతుడికి అడ్డుతగిలిన మునులు ఈ గోలోక కృష్ణుడు ఎవరని అడగడంతో సూతుడు ఆ చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు. వైకుంఠంపైన ఉండే సత్యలోకంలో బ్రహ్మ ఉంటాడు. ఆ సత్య లోకం పైన అనేక నక్షత్రమండలాలతో మధ్య గోలోకం ఉంటుంది. అక్కడ ఎప్పుడూ వెన్నెల లాంటి వెలుగు మాత్రమే ఉంటుంది. ఆ లోకంలో మహావిష్ణువు తన మరో రూపం అయిన కృష్ణుడుగా నలుపు రంగులో ఉంటాడు. అక్కడ ప్రవహించే దివ్యమైన విరజా నది ఒడ్డున తులసివనంలో మురళిని వాయిస్తూ ఒక విధమైన పరవశంలో ఉంటాడు. ఆయన మురళి నుంచి వెలువడిన నాదం ఒక స్త్రీ రూపం దాల్చింది. ఆమే రాధ. రాధ ప్రకృతి, కృష్ణుడు పురుషుడు. వారిద్దరూ ‍ఒకే జంటగా ఎప్పుడూ కలిసి ఉంటరు. అలాగే విరజానది కూడా స్త్రీ రూపం ధరించి కృష్ణుడిని కొలుస్తుంటుంది. ఆమే బృంద. అక్కడి కృష్ణుడి అంశ నుంచి సుదాముడు పుట్టాడు. తను ఎప్పుడూ గోలోకంలోనే ఉంటూ కృష్ణుడు,రాధను సేవిస్తూ ఉంటాడు. ఆ కృష్ణుడిని ఆరాధించే పరుశురాముడు కృష్ణ కవచాన్ని, హరి విల్లును పొందాడని సూతుడు మునులకు తెలిపాడు.

Also Read: ఈ కాలా హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటే శని దృష్టి మిమ్మల్ని ఎప్పటికీ తాకదు..ఎక్కడ ఉందంటే..?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget