శ్రీ కృష్ణుడికి 8 మందిలో ఏ భార్య అంటే ఇష్టం!

Published by: RAMA

శ్రీకృష్ణుడి అష్ట భార్యలు - 1. రుక్మిణి 2. సత్యభామ 3. జాంబవతి 4. కాళింది 5, మిత్రవింద 6.సుదంత 7.భద్ర 8. లక్ష్మణ

విదర్భ రాజు భీష్మకుని కుమార్తె రుక్మిణి..తన సోదరుడు బలవంతంగా శిశుపాలుడికి ఇచ్చి పెళ్లిచేసేందుకు ప్రయత్నిస్తుండగా శ్రీ కృష్ణుడికి సందేశం పంపించి ద్వారక చేరుకుంది

శమంతకమణి కోసం జాంబవంతుడితో యుద్ధం చేసి గెలిచిన కృష్ణుడికి మణితో పాటూ జాంబవతిని ఇచ్చి వివాహం చేశాడు జాంబవంతుడు

శమంతకమణి తీసుకొచ్చిన ఇచ్చినందుకు సత్రాచిత్తు మణితో పాటూ తన కూమర్తే సత్యభామను ఇచ్చి పెళ్లిచేశాడు

కృష్ణుడికి ఐదుగురు మేనత్తలలో రాజాథిదేవి కుమార్తె మిత్రవింద..స్వయంవరంలో భాగంగా కృష్ణుడిని కోరుకుంటుంది.

మేనత్త శృతకీర్తి కుమార్తె అయిన భద్ర కూడా శ్రీకృష్ణుడినే కోరుకుంది

కోసలరాజ్యంలో ఏనుగులు అల్లకల్లోలం సృష్టిస్తే వాటిని అదుపుచేసిన కృష్ణుడికి సుందను ఇచ్చి వివాహం చేస్తాడు తండ్రి నగ్నజిత్తు

కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేస్తుండగా కాళింది మనసుపడుతుంది. ఆ విషయం తెలుసుకుని అర్జునుడు ఇద్దరికీ పెళ్లిచేశాడు..

నారదుడి ద్వారా శ్రీకృష్ణుని గుణగణాలు, మాయలు, రూపురేఖలు విని తననే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి మనువాడింది

వీరిలో శ్రీ కృష్ణుడికి ఇష్టమైన భార్య రుక్మణి..ఎందుకంటే ఆమె సాక్షాత్తూ శ్రీ మహాలక్షి అవతారం..