అన్వేషించండి

Karnataka News: కరెంటు బిల్లు చూసి షాకైన ఇంటి యజమాని, వేలల్లో కాదండోయ్ ఏకంగా లక్షల్లోనే!

Karnataka News: కరెంటు బిల్లు రాగానే ఎంత వచ్చిందో చూస్తాం. అలా చూసిన ఓ ఇంటి యజమాని షాకై షేకయ్యాడు. అందుకు కారణం కేవలం నెల రోజులకు 7 లక్షల రూపాయల బిల్లు రావడం. 

Karnataka News: కర్ణాటకకు చెందిన ఓ ఇంటి యజమాని కరెంటు బిల్లును చూసి ఖంగుతిన్నాడు. ఇది నిజంగా తన ఇంటికి వచ్చిందేనా అని పదే పదే మీటర్ నంబర్ చూసుకుంటూ ఉండిపోయాడు. చూస్తే అంతా కరెక్టుగానే ఉంది కానీ.. రెండు వేలో, మూడు వేలో రావాల్సిన బిల్లే లక్షల్లో వచ్చింది. ఏకంగా ఏడు లక్షలు రావడంతో ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే విద్యుత్ శాఖ అధికారుల వద్దకు వెళ్లి తనకు వచ్చిన బిల్లును చూపించాడు. తన ఇంట్లో వాడుతున్న వాటి గురించి చెప్పి.. బావురుమన్నాడు. తప్పు తమవద్దే జరిగిందని తెలుసుకున్న అధికారులు మరో బిల్లును ఇచ్చి అతడిని ఇంటికి పంపారు. 

అసలేం జరిగిందంటే..?

కర్ణాటక ఉల్లాల్ కు చెందిన సదాశివ ఆచార్య అనే వ్యక్తికి ఇటీవలే కరెంట్ బిల్లు వచ్చింది. అయితే ప్రతీనెల 2 వేల నుంచి 3 వేల వరకూ బిల్లు వచ్చేంది. కానీ జూన్ నెలలో మాత్రం ఏకంగా 7 లక్షల 71 వేల 72 రూపాయలు వచ్చింది. ఇది చూసిన సదాశివ ఆచార్య ఖంగుతిన్నాడు. అది నిజంగా తన ఇంటికే వచ్చిందా అని పదే పదే చెక్ చేశాడు. తనకే వచ్చినట్లు గుర్తించి వెంటనే సంబంధిత అధికారులను కలిశాడు. ఎప్పుడూ వేలల్లో వచ్చే బిల్లు ఈసారి ఏకంగా లక్షల్లో వచ్చిందని చెప్పి వాపోయాడు. అయితే ఆ బిల్లును తీసుకొని చెక్ చేసిన అధికారులు.. బిల్లు తప్పుగా ప్రింట్ అయినట్లు గుర్తించారు. వెంటనే దాన్ని సరి చేసి రూ.2,838 బిల్లును అతడి ఇంటికి పంపారు. 

‘‘ఏజెన్సీల ద్వారా బిల్లుల సేకరణ జరుగుతుంది. ఈ (ఆచార్య) విద్యుత్ బిల్లు బిల్లు రీడర్ లోపం వల్ల తప్పుగా పరింట్ అయింది. కరెంటు బిల్లులో తప్పులుంటే వినియోగదారుడికి ఇవ్వము. సవరించిన బిల్లును ఆచార్యకు అందజేస్తాం.”అని ఉల్లాల్ మెస్కామ్ సబ్-డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఎ దయానాడ అన్నారు.

గృహజ్యోతి పథకంలో భాగంగా అధికార కాంగ్రెస్ చేసిన ప్రధాన ఎన్నికల వాగ్దానాలలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఒకటి. అయితే విద్యుత్ ఛార్జీల పెంపుదల ఏప్రిల్ నుంచి అమల్లోకి రావడంతో పలు ఇళ్లకు విపరీతంగా విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. మే 12 టారిఫ్ ఆర్డర్ ప్రకారం.. జూన్‌లో యూనిట్‌కు 70 పైసల పెంపుదల విధించాలనే విద్యుత్ సరఫరా కంపెనీల ప్రతిపాదనలను కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించిన తర్వాత విద్యుత్ ధర పెరిగింది. దీంతోపాటు ఏప్రిల్‌కు సంబంధించిన యూనిట్‌కు 70 పైసల బకాయిలు కూడా జూన్‌లో బిల్లులకు జతచేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇటీవలే తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఉంది. ఆ పంచాయతీ కార్యాలయానికి ప్రతినెల తరహాలోనే జనవరి నెల కరెంట్ బిల్లు వచ్చింది. కానీ ఆ బిల్లు చూసిన సర్పంచ్, కార్యదర్శికి మాత్రం గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే కొత్తపల్లి గ్రామ పంచాయతీకి జనవరి నెలకుగానూ రూ.11,41,63,672 (11 కోట్ల 41 లక్షల 63 వేల 6 వందల 72 రూపాయలు) విద్యుత్‌ బిల్లు వేశారు. వందలు, వేలల్లో రావాల్సిన కరెంట్ బిల్లు కోట్ల రూపాయల్లో రావడంతో గ్రామానికే షాక్ కొట్టినట్లు అయింది. వామ్మో ఇదేంది.. ఈ రేంజ్ లో కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారా అంటూ గ్రామస్తులు షాక్ అయ్యారు.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget