Janagam Priest: అమెరికాలో సత్యన్నారాయణ వ్రతం - ఇక్కడి నుంచి ఆన్ లైన్ లో మంత్రాలు, పూజారి గారు అప్ డేట్ అయ్యారు!
Telangana News: అమెరికాలో ఉంటున్న ఓ వ్యక్తి నూతనంగా గృహ ప్రవేశం చేస్తుండగా.. ఇక్కడి నుంచే ఆన్ లైన్ లో మంత్రాలు చదువుతూ ఓ పూజారి సత్యనారాయణ వ్రతం జరిపించారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ గా మారింది.

Priest Performed Satyanarayana Vratham Through Online: కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం.. అంటే ఎంత హడావుడి. బంధు మిత్రులను పిలుచుకోవాలి. సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరిస్తారు. అర్చకుడు వేద మంత్రాలు చదువుతుండగా.. ఇంటి యజమాని దంపతులు పూజలో కూర్చుని భక్తి శ్రద్ధలతో వ్రత కథ వింటూ సత్య దేవున్ని అర్చిస్తారు. నూతన గృహంలో ఇటుకలతో ఓ చిన్న పొయ్యి చేసి.. అందులో పాలు పొంగిస్తారు. అలా చేస్తే ఆ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని అందరి విశ్వాసం. స్వామి వారి ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేసి.. పూజ అనంతరం అందరికీ పంచి పెడతారు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా అర్చకులు సైతం అప్ డేట్ అవుతున్నారు. మార్పులను అంది పుచ్చుకుంటూ తమదైన శైలిలో పూజలు జరిపిస్తున్నారు.
ఎక్కడో ఏడు సముద్రాల ఆవల ఉన్న అమెరికాలో ఓ వ్యక్తి గృహ ప్రవేశ కార్యక్రమానికి ఇక్కడి నుంచే ఓ పూజారి ఆన్ లైన్ లో (Online Pooja) మంత్రాలు చదువుతూ సత్యనారాయణ వ్రతం జరిపించారు. జనగామ (Janagam) జిల్లా జఫర్ గడ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన సంతోష్ అనే అయ్యవారు అమెరికాలో ఓ వ్యక్తి గృహ ప్రవేశ కార్యక్రమం, సత్యనారాయణ వ్రతం ఇక్కడి నుంచే జరిపించారు. మొబైల్ వీడియో కాల్ లో ఆయన మంత్రాలు చదువుతూ సత్యనారాయణ వ్రత పూజా విధానం వివరిస్తుండగా.. అవతల అమెరికాలో ఉన్న వ్యక్తి అలానే పూజలు చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట తాజాగా వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతుండగా.. దీన్ని చూసిన నెటిజన్లు 'అయ్యగారు అప్ డేట్ అయ్యారు', 'కాలంతో పాటే మనమూ మారాలి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: TSRTC News: సుదూర ప్రయాణాలు చేసే వారికి శుభవార్త, ఏప్రిల్ 30 వరకు బంపరాఫర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

