అన్వేషించండి

TSRTC News: సుదూర ప్రయాణాలు చేసే వారికి శుభవార్త, ఏప్రిల్‌ 30 వరకు బంపరాఫర్

Telangana News: సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారి టికెట్ పై 10 శాతం రాయితీ అందిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్: సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. ఆ ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్త్‌ల టికెట్లపై 10 శాతం రాయితీ కల్పించాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. సాధారణ టికెట్‌ ధరలో ప్రయాణికులు బుక్‌ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను కల్పించింది. లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఏప్రిల్‌ 30 వరకు డిస్కౌంట్‌ అమల్లో ఉంటుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఓ ప్రకటనలో తెలిపారు. 


TSRTC News: సుదూర ప్రయాణాలు చేసే వారికి శుభవార్త, ఏప్రిల్‌ 30 వరకు బంపరాఫర్

లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో సేవలు అందిస్తున్నాయి. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ కు, గోదావరిఖని- బెంగళూరు, కరీంనగర్- బెంగళూరు, నిజామాబాద్ -తిరుపతి, నిజామాబాద్ -బెంగళూరు, వరంగల్-బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి. ఈ రూట్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ ఎండీ సజ్జనార్ ప్రజలను కోరారు.

శీతాకాలం ముగిసి ఎండాకాలం వచ్చేసింది. వచ్చే నెలలో పరీక్షలు పూర్తైన తర్వాత విద్యార్థులకు వేసవి సెలవులు రానున్నాయి. విద్యార్థులకు హాలిడేస్ వస్తున్నాయంటే కుటుంబసభ్యులు విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వేసవి సెలవులు ఎక్కువ రోజులు ఉంటాయి కనుక ఈ కాలంలో తల్లిదండ్రులు తన పిల్లలతో కలిసి టూర్స్‌కు వెళుతూ ఉంటారు. ప్రముఖ దేవాలయాలతో పాటు అందమైన ప్రదేశాలకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువమంది తమ ఫ్యామిలీతో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీశైలానికి వెళుతూ ఉంటారు. అలాంటి వారికి టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. నగరం నుంచి శ్రీశైలంకు ఇప్పటివరకు నాన్ ఏసీ బస్సులను మాత్రమే టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. కానీ ఏపీ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

శ్రీశైలానికి ఏసీ బస్సులు.. 
హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు 85 కొత్త బస్సులను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. వీటిలో 10 ప్రత్యేక ఏసీ బస్సులు కూడా ఉన్నాయి. ఇటీవల ఈ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. ఎండాకాలంలో చల్లని వాతావరణంలో శ్రీశైలంకు వెళ్లాలనుకునే భక్తులకు ఏసీ బస్సులు ఉపశమనం కలిగించనున్నాయి. ఇప్పటివరకు ఏసీ బస్సులు లేకపోవడంతో చాలామంది హైదరాబాద్ నుంచి సొంత కార్లు, అద్దె కార్లలో వెళ్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు రోజూ 30 సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏసీ బస్సులు లేకపోవడంతో ఎండాకాలంలో సదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి ఇబ్బంది పడుతున్నారు. ఉక్కబోత, ఎండ వేడికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని ప్రయాణికులు సౌకర్యార్థం ఏసీ బస్సులు తీసుకురావడంతో శ్రీశైలం వెళ్లేవారు చల్లగా ప్రయాణం చేయవచ్చు.

మరోవైపు రాజధాని ఏసీ బస్సుల పొడవు ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్లలో మలుపులు తిరగడం కష్టం. దీంతో శ్రీశైలంకు సూపర్ లగ్జరీ బస్సులను మాత్రమే టీఎస్‌ ఆర్టీసీ నడుపుతోంది. కానీ ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సుల తరహాలోనే రాజధాని బస్సులను తయారు చేయించారు. దీంతో ఘాట్ రోడ్లలో ప్రయాణానికి కూడా ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ బస్సులతో శ్రీశైలంకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, తర్వాత టీఎస్‌ఆర్టీసీకి కూడా లాభం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా టీఎస్‌ఆర్టీసీ కొత్త బస్సులను తీసుకొస్తుంది. పర్యాటక ప్రదేశాలకు బస్సుల సంఖ్యను పెంచుతుంది. ఆర్టీసీకి కూడా ఆదాయం వస్తుంది. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Dasara Festival Rush: పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
Hyderabad Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Embed widget