Ship Fire: రూ.3 వేల కోట్ల ఖరీదైన లగ్జరీ కార్లు మంటల్లో మటాష్.. ఆ నౌకలో అగ్నిప్రమాదానికి కారణం ఇదేనా?
అట్లాంటిక్ సముద్రంలో ఓ నౌకలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం వల్ల సుమారు 3 వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇంతకీ ఆ మంటలు ఎలా ఏర్పడ్దాయి?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లుగా పేరొందని వోక్స్‌వ్యాగన్, పోర్స్చే, ఆడి, బెంట్లీ, లంబోర్ఘిని (Volkswagen, Porsche, Audi, Bentley, Lamborghini) మోడల్ కార్లను తీసుకెళ్తున్న భారీ వాణిజ్య నౌక ఒకటి మంట్లలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జర్మనీ నుంచి అమెరికాకు 4 వేల కార్లతో బయల్దేరిన నౌక గత బుధవారం (ఫిబ్రవరి 16న) అట్లాంటి సముద్ర జలాలాలు మీదుగా ప్రయానిస్తున్న సమయంలో.. అజోరెస్ (Azores) సమీపంలో అగ్నిప్రమాదానికి గురైంది. మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో వెంటనే వాటిని అదుపులోకి తీసుకురాలేకపోయారు. సముద్రం మధ్యలో ఈ ప్రమాదం జరగడం వల్ల మంటలను ఆర్పడం మరింత కష్టమైంది.
అగ్ని ప్రమాదం వల్ల ఆ నౌకలో ఉన్న కార్లన్నీ దహనమైనట్లు తెలిసింది. ఇప్పటివరకు వరకు ఆ కార్ల కంపెనీలు వేసిన లెక్కల ప్రకారం.. కార్లతోపాటు, వాటి విడిభాగాలు తదితర వస్తువులన్నీ కలుపుకుని సుమారు రూ.3,001 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే, వారం రోజులుగా నౌకలో మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, నౌక మొత్తం కాలిపోకుండా అగ్నిమాపక దళాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. మంగళవారం నాటికి నౌకలో మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: భర్త వీర్యాన్ని కేకులు, డ్రింక్స్‌లో కలిపి విద్యార్థులకు పంచిన టీచర్, చివరికిలా చిక్కింది
సముద్రం మధ్యలో ప్రమాదం జరగడం వల్ల మంటలను అదుపు చేయడం కష్టంగా ఉందని అధికారులు తెలిపారు. వీటిలో ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా ఉన్నాయని, ఆ కార్లలో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీల వల్ల మంటలు అదుపు కావడం లేదన్నారు. వాటిని కేవలం అగ్నిమాపక దళాల వద్ద ఉండే రసాయనాలు మాత్రమే ఆర్పగలవని తెలిపారు. నీళ్లను ఎక్కువగా నౌకలోకి వదలడం కూడా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందన్నారు. ప్రస్తుతం ఈ మంటలు నౌకలోని ఇంధన ట్యాంకు వరకు వ్యాపించలేదన్నారు. కార్ల బ్యాటరీల్లో షార్ట్ సర్క్యూట్ వల్లే నిప్పు ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. నౌకా సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించేసరికే నష్టం జరిగిపోయిందని తెలిపారు. ఆ నౌకలో పనిచేస్తున్న 22 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, ఆ కార్ల సంస్థలకు మాత్రం ఇది భారీ నష్టమే.
View this post on Instagram