News
News
X

Elephant Birthday: గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న ఏనుగు, కేక్ కూడా కట్ చేసింది

Elephant Birthday: యూపీలోని బిజ్నోర్‌లో ఓ నాలుగేళ్ల ఏనుగుకి అటవీ అధికారులు బర్త్‌డే వేడుకలు జరిపించారు.

FOLLOW US: 

ఏనుగుకి నాలుగో పుట్టిన రోజు..

యూపీలోని బిజ్నోర్‌లో నాలుగేళ్ల వయసున్న ఏనుగుకి బర్త్‌డే వేడుకలు జరిపించారు. చుట్టుపక్కల బెలూన్స్ కట్టి, ఫ్రూట్ కేక్ కట్ చేయించారు. ఏనుగులు ఈ పార్టీకి వచ్చి కేక్ ఆరగించి వెళ్లాయి. బిజ్నోర్‌లోని "కలగర్ ఎలిఫెంట్ క్యాంప్‌లో" జరిగింది ఈ వింతైన పార్టీ. ఆగస్టు 2వ తేదీతో సావన్ (ఏనుగు పేరు)కు నాలుగేళ్లు నిండిన సందర్భంగా...అటవీ అధికారులు ఇలా వెరైటీగా వేడుక చేశారు. యూపీ-ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఉన్న జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలోనే ఉందీ కలగర్ ఎలిఫెంట్ క్యాంప్. ఈ సావన్‌ కోసం ప్రత్యేకంగా ఫ్రూట్ కేక్ తయారు చేయించారు. కేక్ కట్‌ చేయించటాన్ని చూసిన మిగతా ఏనుగులు ఒక్కసారిగా అక్కడికి వచ్చాయి. ఇప్పుడే కాదు. సావన్ పుట్టినప్పటి నుంచి ఆగస్టు 2వ తేదీన బర్త్‌డే వేడుకలు చేస్తున్నారు అటవీ అధికారులు. ప్రస్తుతం ఈ క్యాంప్‌లో 9 ఏనుగులు ఉంటున్నాయి. వీటిని 9 ఏళ్ల క్రితం కర్ణాటక నుంచి తీసుకువచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం కాంచభ అనే ఏనుగుకి పుట్టిన ఏనుగుకి సావన్ అని పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఘనంగా బర్త్‌డే సెలబ్రేట్ చేస్తున్నారు. కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో భాగమైన ఈ ఎలిఫెంట్ క్యాంప్‌లో ఏనుగుల సంరక్షణకు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. మాన్‌సూన్ పాట్రోలింగ్‌ కోసం ఈ ఏనుగులను వినియోగిస్తారు. వీటికి అవసరమైన మందులు, ఆహారం, డ్రింక్స్‌, వసతి ఏర్పాట్లు అన్నీ చేసినట్టు అధికారులు వెల్లడించారు.

హ్యాపీ బర్త్‌డే గజరాజ్..

సావన్ బర్త్‌డే పార్టీని అధికారులంతా ఎంజాయ్ చేశారు. ఏనుగు కేక్ కట్ చేసే సమయంలో అందరూ చప్పట్లు కొడుతూ సందడి చేశారు. సావన్ కూడా ఎంతో ఆనందంగా ఆ కేక్‌ను ఆరగించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌ అయ్యాయి. హ్యాపీ బర్త్‌ డే గజరాజ్ అంటూ కొందరు నెటిజన్లు విషెస్ చెబుతున్నారు. ఈ ఏనుగుకి ముందుగా శంభు అనే పేరు పెట్టారు. తరవాత సావన్‌గా మార్చారు. 
 
Published at : 03 Aug 2022 12:39 PM (IST) Tags: Elephants Elephant Birthday Sawan Elephant Kalagarh Elephant Camp

సంబంధిత కథనాలు

Viral: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే

Viral: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే

Hiroshima Nagasaki: హిరోషిమాపై అణుదాడి జరిగే ముందు ఏం జరిగిందో తెలుసా? ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలెన్నో!

Hiroshima Nagasaki: హిరోషిమాపై అణుదాడి జరిగే ముందు ఏం జరిగిందో తెలుసా? ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలెన్నో!

Mahesh Babu Birthday: ‘మహీ, నా జీవితంలో వెలుగులు నింపావ్’ - భర్తకు నమ్రతా విషెస్, సూపర్ స్టార్‌కు చిరు, రోజా ట్వీట్స్!

Mahesh Babu Birthday: ‘మహీ, నా జీవితంలో వెలుగులు నింపావ్’ - భర్తకు నమ్రతా విషెస్, సూపర్ స్టార్‌కు చిరు, రోజా ట్వీట్స్!

Mother and Son Govt Jobs: ఆ తల్లీ కుమారుడు అదుర్స్, ఒకేసారి ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు

Mother and Son Govt Jobs: ఆ తల్లీ కుమారుడు అదుర్స్, ఒకేసారి ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు

Harsha Sai: హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైవ్ స్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు

Harsha Sai: హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైవ్ స్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు

టాప్ స్టోరీస్

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక