Viral Video: దటీజ్ పవర్ ఆఫ్ మదర్ - తన బిడ్డను తల్లి ఎలుగు ఎలా కాపాడుకుందో చూడండి, వైరల్ వీడియో
Viral News: ఎలుగు కూనపై దాడికి యత్నించిన పులిపై తల్లి ఎలుగు తిరగబడింది. వీరోచితంగా పోరాడి తన బిడ్డను రక్షించుకోవడమే కాకుండా పులి తోక ముడిచేలా చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Bear Saved Its Cub From Tiger In Maharastra: అమ్మ.. ఈ సృష్టిలో గొప్ప పదం. ప్రతి క్షణం తన బిడ్డలు బాగుండాలనే ఏ తల్లైనా కోరుకుంటుంది. తన పిల్లల జోలికి వచ్చినా.. ఏదైనా హాని కలిగించినా ఏ మాతృమూర్తి సహించదు. వారిని రక్షించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తుంది. ఎవరితోనైనా పోరాడుతుంది. ఇది మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ చూస్తాం. ఓ ఎలుగు తన బిడ్డను కాపాడుకునేందుకు పులితో వీరోచితంగా పోరాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలుగు ధాటికి పులి తోక ముడిచింది. అసలు వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని తాడోబా - అంధేరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఓ ఎలుగుబంటి తన పిల్లలతో వెళ్తుండగా అనుకోని ప్రమాదం ఎదురైంది. ఓ పులి ఎలుగు కూనపై దాడికి దిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తల్లి ఎలుగు పులికి ఎదురెళ్లింది.
View this post on Instagram
తన ప్రాణాలను సైతం లెక్కచేయక పులితో వీరోచితంగా పోరాడింది. దీంతో చేసేది లేక పులి అక్కడి నుంచి తోక ముడిచింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. 'ఓ తల్లి తన బిడ్డ కోసం ఎంత ధైర్యం ప్రదర్శించిందో' అంటూ ఓ నెటిజన్ స్పందించగా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బిడ్డ ప్రాణాల కోసం తల్లి ఇలానే సాహసం చేస్తుందని మరో నెటిజన్ కామెంట్స్ చేశారు.
Also Read: Fire Break: టాటా ఐఫోన్ల తయారీ కేంద్రంలో భారీ పేలుడు - ఎగిసిపడిన మంటలు, షాకింగ్ వీడియో
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

