అన్వేషించండి

Kavitha Politics : కవిత చేస్తున్న ఉద్యమాలు బీఆర్ఎస్ తరపున కాదా ? సొంత రాజకీయాలు చేస్తున్నారా ?

Telangana News : కల్వకంట్ల కవిత చేస్తున్న రాజకీయ కార్యక్రమాలపై బీఆర్ఎస్‌లో విస్తృత చర్చ జరుగుతోంది. ఆమె పార్టీ తరపున కాకుండా సొంత కార్యక్రమాలు నిర్వహిస్తూండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

Wide discussion in BRS about the political activities of Kalvakantla Kavitha :  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవలి కాలంలో రాజకీయంగా దూకుడుగా కనిపిస్తున్నాయి. దాదాపుగా ప్రతీ రోజూ ఏదో ఓ కార్యక్రమం పేరుతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. సహజంగా కవిత చేస్తున్న కార్యక్రమాలన్నీ బీఆర్ఎస్ కార్యక్రమలే అనుకుంటారు. నిజానికి కవిత బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. సొంతంగా తెలంగాణ జాగృతి పేరు మీదనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా మహిళా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి జీవో నెంబర్ 3 మీద చేయబోయే ధర్నాను కూడా జాగృతి పేరు మీదనే నిర్వహిస్తున్నారు. 

తెలంగాణ జాగృతి పేరుతో  జీవో నెంబర్ 3కి వ్యతిరేకంగా ధర్నా                

జీవో నంబర్ 3కు వ్యతిరేకంగా  శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద  భారత జాగృతి ధర్నా నిర్వహించనుంది. బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా ఈ ఆందోళనను నిర్వహించనున్నారు. కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ పిలుపు మేరకు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం తన సంస్థ వేదికగా వేరే కార్యక్రమాలు నిర్వహిస్తుండటం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.  చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కూడా భారత జాగృతి ఆధ్వర్యంలోనే చేపట్టారు.  ఇందులో బీఆర్ఎస్, సీపీఐ,సీపీఎం నాయకులు పాల్గొన్నప్పటికీ కార్యక్రమం మాత్రం భారత జాగృతి ఆధ్వర్యంలోనే సాగింది. 

బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనని కవిత                    

బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కార్యక్రమాలు చేయడం లేదు.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విమర్శలు వస్తున్న తరుణంలో బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, ఇతర ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంకు కవిత వెళ్లలేదు.   ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ  బుధవారం ) బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించింది.  సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనల్లో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కవిత కనిపించలేదు. ఇదే సమయంలో చిన జీయర్ స్వామితో భేటీ అయ్యారు.  

కవిత సొంత ముద్ర కోసం  ప్రయత్నిస్తున్నారా ?                           

అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టాలన్న డిమాండ్  ను కూడా కవిత తెరపైకి తెచ్చారు. ఈ డిమాండ్ పూర్తిగా బీఆర్ఎస్‌కు సంబంధం లేకుండా.. తెలంగాణ జాగృతిపేరు మీదనే  నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమవేశాలు కూడా నిర్వహించారు. కవిత చేసే రాజకీయం జాగృతి పేరు మీదనే ఉంది.  బీఆర్ఎస్ తో సంబంధం లేదన్నట్లగా ఆమె చేస్తున్న రాజకీయం..  ఏదో తేడా ఉందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం లేదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Roster Dating : ఎవరితోనైనా, ఎందరితోనైనా, ఎప్పుడైనా డేట్ చేయొచ్చట.. రోస్టర్ డేటింగ్​లో అమ్మాయిలదే హవా
ఎవరితోనైనా, ఎందరితోనైనా, ఎప్పుడైనా డేట్ చేయొచ్చట.. రోస్టర్ డేటింగ్​లో అమ్మాయిలదే హవా
Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Embed widget