By: ABP Desam | Updated at : 09 Aug 2021 08:20 AM (IST)
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో సోమవారం (ఆగస్టు 9న) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. అయితే, వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏమీ లేవని స్పష్టం చేశారు.
ఆదివారం (ఆగస్టు 8న) రాత్రి సమయంలో హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. మర్నాడు అంటే ఆగస్టు 9న రాత్రి వరకూ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని సూచించారు. చాలాచోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షప్రభావం ఉంటుందని వివరించారు.
తెలంగాణలో ఈ జిల్లాల్లోనే వానలు పడే అవకాశం
హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 9న ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
Also Read: Gold-Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా.. నేటి తాజా ధరలు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
పశ్చిమ దిశ నుంచి కోస్తాంధ్ర మీదుగా గాలులు వీస్తుండటంతో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే, ఈ నెల 12న బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా మచిలీపట్నం, గుంటూరు మీదుగా ఏపీ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఫలితంగా ఆదివారం నుంచి కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వానలు కురిసే సూచనలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. 13వ తేదీ తరువాత వర్షాలు ఊపందుకుంటాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాయలసీమలో ఒకట్రెండు చోట్ల, దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి.
Also Read: Petrol-Diesel Price, 9 August: నేడు ఇంధన రేట్లు భారీగా పెరుగుదల.. ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇవే..
Karimnagar News : వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య- కలచివేస్తున్న సూసైడ్ నోట్
Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
Honor Killing In Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం- మతాంతర వివాహం చేసుకుందని కుమార్తె గొంతు కోసి హత్య చేసిన తండ్రి
Breaking News Live Updates: హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం
Anna Hazare President Candidate KCR Plan: రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నా హజారే ! కేసీఆర్ చెబుతున్న సంచలనం అదేనా ?
Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి
F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?
Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, ఆ వెంటనే గతం మరిచిపోయిన భర్త, ఇలా మీకూ జరగొచ్చట!
Xiaomi New TV: ఈ టీవీ ఇంట్లో ఉంటే థియేటర్‌కి వెళ్లక్కర్లేదుగా - అదిరిపోయే ఎక్స్పీరియన్స్!