By: ABP Desam | Updated at : 06 Jun 2023 07:00 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
నిన్నటి ఆవర్తనం ఈ రోజు దక్షిణ ఛత్తీస్ గఢ్, పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వద్ద స్థిరంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (జూన్ 5) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ద్రోణి ఉత్తర ఛత్తీస్ గఢ్ నుండి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతూ ఉంది.
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజులు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 42°C నుండి 44°C వరకు స్థిరంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు చుట్టు ప్రక్కల జిల్లాలలో 39°C నుండి 41°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు గాలి వేగం గంటకు 30 నుండి 40 కి.మీతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉంది. (ఈ రోజు, రేపు ఖమ్మం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో.. 3, 4, 5 రోజులు ఈ జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా వడగాలులు వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 41 డిగ్రీలు, 28 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 64 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
నైరుతి రుతుపవనాలు రావడం ఆలస్యం కావడంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు ఎండతీవ్రత ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ చెప్పారు. రేపు అల్లూరి జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు జిల్లా కుకునూర్, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాల్పులు, 212 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.
సోమవారం ఏన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 43.3°C, ఏలూరు జిల్లా శ్రీరామవరంలో 43.1°C, తిరుపతి జిల్లా గొల్లగుంటలో 42.9°C, కృష్ణా జిల్లా కాజాలో 42.4°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. 21 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వెల్లడించారు.
రాబోవు మూడు రోజులు కింద విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వివరించారు
☀ జూన్ 6 మంగళవారం
• అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
☀ జూన్ 7 బుధవారం
• అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య ,చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
☀ జూన్ 8 గురువారం
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!
TSPSC: 'గ్రూప్-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ
Rain In Hyderabad: హైదరాబాద్‌లో వర్షం - చిరుజల్లుల మధ్యే కొనసాగుతున్న నిమజ్జనం
Minister Dance: గణేశ్ శోభాయాత్రలో డాన్స్ చేసిన మంత్రి, ఆయనతో కలెక్టర్, ఎస్పీ కూడా
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
/body>